కర్ణాటకలో మరో అరుదైన చిరుతపులి దర్శనమిచ్చింది. కర్ణాటకలోని విజయనగర జిల్లాలో, హోలేమట్టి నేచర్ ఫౌండేషన్ (HNF) వన్యప్రాణి శాస్త్రవేత్త సంజయ్ గుబ్బి, బృందం తొలిసారిగా అత్యంత అరుదైన చిరుతపులిని గుర్తించారు. చేశారు. హోలేమట్టి నేచర్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్న సంజయ్ గుబ్బి అన్వేషణకు సంబంధించి ఇది కర్ణాటకలో తొలి రికార్డు. ట్రాప్ కెమెరాకు చిత్రాల ఆధారంగా పరిశోధకులు చిరుతపులిని నిర్ధారించారు.
అంతర్జాతీయంగా దీన్ని స్ట్రాబెర్రీ చిరుత ( strawberry leopard) అని పిలుస్తారు. సాధారణ చిరుతపులిలా ముదురు నల్ల రంగు మచ్చలు కాకుండా అసాధారణమైన లేత గోధుమ రంగు మచ్చలు లేత ఎరుపు గులాబీ రంగు కోట్, గంధపు చెక్కరంగును పోలిన చర్మంతో ఉంది. ఇది చాలా అరుదైన అద్భుతమైన చిరుత అని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి చాలా తక్కువ ఉన్నాయని చెబుతున్నారు.

అంతర్జాతీయంగా దీనిని 'స్ట్రాబెర్రీ చిరుత’గా చెబుతున్నప్పటికీ సంజయ్ గుబ్బి దీనికి 'గంధపు చిరుత' (sandalwood leopard) అని పేరు ప్రతిపాదించారు. కర్ణాటక గంధపు చక్కలకు ప్రసిద్ధి కాబట్టి, ఈ పేరు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందని, ప్రాంతీయ పరిరక్షణ ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుందని ఆయన అభిప్రాయం.
అరుదైన రంగు-శాస్త్రీయ కారణాలు
జన్యు మార్పు కారణంగా వాటికి రంగు వస్తుందని శాస్త్రవేత్తల విశ్లేషణ. ఇది ఎరిథ్రిజం (Erythrism) లేదా హైపోమెలనిజం అనే జన్యుపరమైన స్థితి వల్ల సంభవిస్తుంది. దీనివల్ల శరీరంలో ఎరుపు వర్ణద్రవ్యం (Red pigment) పెరిగి, నలుపు వర్ణద్రవ్యం తగ్గుతుంది.ఇటువంటి లక్షణాలు అడవి క్షీరదాలలో సహజంగా సంభవిస్తాయి. దీని ఖచ్చితమైన స్థితిని తెలుసుకోవడానికి DNA పరీక్షలు, విశ్లేషణ అవసరమని గుబ్బి భావిస్తున్నారు.శాస్త్రవేత్తలు ఫోటోగ్రాఫిక్ మరియు దృశ్య ఆధారాలపై ఆధారపడతారు కనుక ఈ చిరుతపులిని అరుదైన మార్ఫ్‌గా వర్ణించారు.
వయస్సు , లింగం : కెమెరా ట్రాప్ చిత్రాల ద్వారా ఇది 6 ఏళ్ల వయస్సున్న ఆడ చిరుత అని నిర్ధారించారు.
భారతదేశంలో ఇంతకు ముందు ఇలాంటి చిరుతపులి ఒకటి మాత్రమే నమోదైంది. 2021 నవంబరులో రాజస్థాన్‌లోని రణక్‌పూర్ ప్రాంతంలో ఇలాంటి చిరుత కనిపించింది. ఇప్పుడు కర్ణాటకలో కనిపించడం ఇది రెండోసారి. దక్షిణాఫ్రికా , టాంజానియా వంటి దేశాల్లో మాత్రమే అక్కడక్కడా ఇవి కనిపించాయి.
ఈ ప్రాంతం కళ్యాణ కర్ణాటకలో ఉంది. హోలేమట్టి నేచర్ ఫౌండేషన్ ఈ డాక్యుమెంటేషన్‌కు నాయకత్వం వహించింది. ఈ బృందంలో సంజయ్ గుబ్బి, సందేశ్ అప్పు నాయక్, శ్రావణ్ సుతార్, పూర్ణేష హెచ్.సి. రుమా కుందార్కర్, రవిచంద్ర వెలిప్ పాల్గొన్నారు.
చదవండి: ధర్మశాలలో ర్యాగింగ్ భూతం : పోరాడి ఓడిన 19 ఏళ్ల పల్లవి
చిరుతపులుల సంఖ్యను లెక్కించడం, గుర్తించడం వీరి లక్ష్యం. ఇది కీలకమైన పరిరక్షణ ప్రకృతి దృశ్యాలను కూడా గుర్తిస్తుంది. ఈ ప్రాంతం భారతీయ బూడిద రంగు తోడేలు వంటి జాతులకు కేంద్రం. చారల హైనా, బెంగాల్ ఫాక్స్ కూడా నివసిస్తాయి. కర్ణాటకలో దాదాపు 2,500 చిరుతపులులు ఉన్నాయని ఫౌండేషన్ అంచనా వేసింది. ఇలాంటి ఆవిష్కరణలు నాలెడ్జ్ గ్యాప్‌ను హైలైట్ చేస్తాయని, అడవులపై పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.
ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్


