Watch: Viral Video Of Haryanvi Dadi Talking On Call In Funny Way - Sakshi
Sakshi News home page

Haryani Dadi Viral Video: ‘మీరు కాల్‌ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అనగానే బామ్మ ఆగ్రహంతో..

Jul 16 2023 12:26 PM | Updated on Jul 16 2023 2:43 PM

video of haryanvi dadi talking on call in funny way - Sakshi

ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక బామ్మకు సంబంధించిన వీడియో అందరినీ తెగ నవ్విస్తోంది. ఈ వీడియోలో బామ్మ ఫోనులో మాట్లాడుతూ కనిపిస్తుంది.  ఆమె మాటలను విన్నవారంతా తెగ నవ్వుకుంటున్నారు.ఆ బామ్మ హరియాణాకు చెందినది. వీడియోలో బామ్మ ఏమి మాట్లాడుతున్నదో తెలిస్తే ఎవరైనా విస్తుపోవలసిందే. వీడియోలో కంప్యూటర్‌ జనరేటెడ్‌ వాయిస్‌ వినిపిస్తుంటుంది. ‘మీరు కాల్‌ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు’ అని దానిలో వినిపిస్తుండగా, ఆ వాయిస్‌ విన్న బామ్మ కోపంతో తన ధోరణిలో మాట్లాడుతుంటుంది. 

వీడియోలో ముందుగా బామ్మ ఫోన్‌ చేస్తూ కనిపిస్తుంది. అటువైపు నుంచి రింగ్‌ వినిపిస్తుంది గానీ, ఎవరూ లిఫ్ట్‌ చేయరు. ఇంతలో కంప్యూటర్‌  రికార్డెడ్‌ వాయిస్‌ వినిపిస్తుంది. మీరు కాల్‌ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదంటూ బామ్మకు ఒక యువతి గొంతు వినిపిస్తుంది. అంతే ఆ బామ్మ ఆగ్రహంతో ఆ కంప్యూటర్‌ వాయిస్‌ నిజమైనదేనని భావిస్తూ క్లాస్‌ పీకుతుంది. ఇది విన్న ఎవరైనా తమ నవ్వును అదుపుచేసుకోలేరు. అయితే ఆ బామ్మకు అసలు విషయం తెలియక ఫోనులో ఎవరో యువతి మాట్లాడుతున్నదని భావిస్తూ, ఆపకుండా మాట్లాడుతుంది.  ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 
 

ఇది కూడా చదవండి: యువకుని ప్రాణాలు తీసిన మూమూస్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement