కుటుంబ సభ్యుల క్రూరత్వం, ఫోన్‌లో మాట్లాడుతున్నారని..

Two Tribal Women Thrashed Chatting On Phone Male Cousins Madhya Pradesh - Sakshi

భోపాల్‌: దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించిన వారి పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా వారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు, ఇంకెన్నో కార్యక్రమాలు చేపడుతున్నా అవేవి వారిని కాపాడలేకపోతున్నాయనే చెప్పాలి. ఓ వైపు బయట వాళ్ల నుంచి లైంగిక దాడులు, మరో వైపు కుటుంబ సభ్యుల నుంచి ఆచారాలు పేరుతో ఆగడాలు.. ఇలా వాళ్లపై హింసాకాండలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఇటీవల ఓ యువతిని కుటుంబ సభ్యులే చెట్టుకు వేలాడదీసి కర్రలతో కొట్టగా.. తాజాగా సభ్య సమాజంలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనే సందేహం కలిగేలా.. బంధువులతో ఫోన్లో మాట్టాడారని నేపంతో కుటుంబ సభ్యులే యువతులపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఇద్దరు యువతులు వారి బంధువులతో ఫోన్‌ మాట్లాడుతున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది.

దీంతో కోపంతో ఆ యువతులను ఇంట్లోని వారే దారుణంగా హింసించారు. కాగా వీడియో బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో.. యువతులు కొట్టకండి అని కుటుంబ సభ్యులను వేడుకుంటున్నా కనికరం లేకుండా వాళ్లను కర్రలు, రాళ్ళతో కొట్టారు. వారిని హింసించిన వారిలో ఓ మహిళ కూడా ఉండడం​ గమనార్హం. తాండా పోలీస్ స్టేషన్ అధికారుల ప్రకారం.. ఈ సంఘటన జూన్ 22 న పీపాల్వా గ్రామంలో జరగగా,  వీడియో కాస్త జూన్ 25 న పోలీసులకు చేరింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top