టీనేజ్‌ పిల్లల్లో పాప్‌కార్న్‌ బ్రెయిన్‌ | Teenagers and young adults face the highest risk of developing popcorn brain syndrome | Sakshi
Sakshi News home page

టీనేజ్‌ పిల్లల్లో పాప్‌కార్న్‌ బ్రెయిన్‌

Jul 30 2026 12:43 AM | Updated on Jul 30 2026 12:43 AM

Teenagers and young adults face the highest risk of developing popcorn brain syndrome

ఇదో ఆందోళన పడాల్సిన మానసిక స్థితి అంటున్న నిపుణులు

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ఈ డిజిటల్‌ యుగంలో పిల్లలు ఏకకాలంలో ఒకవైపు టీవీ చూస్తూనే, ఫోన్‌లో చాట్‌ చేస్తూ, గేమ్స్‌ ఆడటం సర్వసాధారణం అయిపోయింది. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డేవిడ్‌ ఎం.లెవీ దీనినే ’పాప్‌కార్న్‌ బ్రెయిన్‌’ అన్నారు. డిజిటల్‌ మల్టీటాస్కింగ్‌కు అలవాటు పడి, పాప్‌కార్న్‌లాగా ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా దూకడం, నిజ జీవితంలోని నెమ్మదైన పనులపై ఏకాగ్రత కోల్పోవడాన్ని ఇది సూచిస్తుంది. దీనిని మానసిక సమస్య అని నిర్ధారించలేదు. కానీ ఆందోళన పడాల్సిన మానసిక స్థితి అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇది టీనేజ్‌ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

పాప్‌కార్న్‌ బ్రెయిన్‌  లక్షణాలు
 ఒకే పనిపై ఎక్కువ సేపు దృష్టి పెట్టలేకపోవడం, ఒక విషయం మీద ఆసక్తి, శ్రద్ధ వెంట వెంటనే మారిపోవడం ళీ నిమిష నిమిషానికి నోటిఫికేషన్లు, కొత్త డిజిటల్‌ కంటెంట్‌ కోసం పరితపించడం 
 సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో వైఫల్యం. పెద్దల సూచనలను పాటించడంలో మైండ్‌ను వెంటనే కనెక్ట్‌ చేసుకోలేక ఇబ్బంది పడటం. ఒక్కమాటలో చెప్పాలంటే పరధ్యానం. ళీ నిద్ర లేమి, ఆందోళన చెందడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం

తల్లిదండ్రులు ఏం చేయాలి?
రోజూ కొంత సమయం స్క్రీన్‌లు లేకుండా ప్రశాంతంగా, వర్తమానంలో గడపడం వల్ల మెదడు తిరిగి ఏకాగ్రతను పుంజుకుంటుంది. 
 స్క్రీన్‌ వినోదానికి కేటాయించినంత సమయాన్ని శారీరక శ్రమకు, ఇతర హాబీలకూ కేటాయించాలి. పిల్లల చదువు పూర్తయిన తర్వాత మిగిలిన సమయానికి తగినట్లు టైంటేబుల్‌ ఇవ్వాలి. 

పిల్లలకు నిరంతరం ఏదో ఒక డిజిటల్‌ స్టిమ్యులేషన్‌ అవసరం లేదు. ఖాళీగా ఉండటం వల్ల వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనల రెక్కలు విచ్చుకుంటాయి. సహనం పెరుగుతుంది.

 వర్చువల్‌ ప్రపంచం కంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా ముఖాముఖి గడిపేలా ప్రోత్సహించాలి. 
ఇష్టమైన పుస్తకాలు చదవడం వంటి హాబీలను ప్రోత్సహించాలి. చదివిన విషయాన్ని ఇంట్లో వాళ్లతో చర్చించే వాతావరణం కల్పించాలి. తల్లిదండ్రులతో కలిసి వాకింగ్‌ చేయడం అలవర్చాలి. పజిల్‌ పూరించడం, డ్రాయింగ్‌ లేదా క్రాఫ్ట్‌ వంటి హాబీలతో చిన్న చిన్న ప్రాజెక్టు చేసేవిధంగా ప్రోత్సహించాలి.  

పిల్లలపై ప్రభావం 
మెదడు అభివృద్ధి చెందే కీలక దశలో డిజిటల్‌ పరధ్యానం వారిలో కొత్త  విషయాలను నేర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. అధ్యయనాల ప్రకారం, మితిమీరిన ఇంటర్నెట్‌ వాడకం పిల్లల్లో వాచిక మేధస్సు తగ్గడానికి కారణమవుతోంది. అలాగే, నిజ జీవిత సామాజిక నైపుణ్యాలు లోపించి, చిన్న సమస్యలకే వారు అధిక ఒత్తిడికి గురవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement