breaking news
Mood
-
మౌనమేలనోయి.. యువతను వెంటాడుతున్న షైనెస్
కొన్ని సందర్భాల్లో సైలెన్స్ ఎంత ప్రశాంతతనిస్తుందో.. మరికొన్ని సందర్భాల్లో సైలెన్స్..అంత వైలెంట్‌గా ఉంటుంది.. ఈ విషయం మనలో చాలా మంది గ్రహించే ఉంటాయి. కానీ ప్రస్తుత తరంలోని కొందరు యువత ఇదే సూత్రంగా పాటిస్తున్నారు. కంఠానికి కళ్లెం వేస్తున్నారు. ఎప్పుడూ మౌనంగా కూర్చుంటూ.. ఫోన్ చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. మనసులోని భావాలను స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితికి వెళ్లి పోతున్నారు. ఏది చెప్పాలన్నా సైగలతోనూ.. మెసేజ్‌లు, చాటింగ్ రూపంలోనో తప్ప ఎదురుపడి మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గట్టిగా మాట్లాడితే షైనెస్ ఫీల్ అవుతున్నారు.. ఫోన్ అడిక్షన్ కారణంగా బయటి వారితోనే కాదు.. ఏకంగా ఇంట్లో వారితోనూ మాట్లాడలేని స్థితికి చేరుకుంటున్నారు పలువురు నగరవాసులు. దీంతో గత్యంతరం లేక మానసిక వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి తప్పడం లేదని వాపోతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో ఫోన్ అడిక్షన్తో భావప్రకటనకు బ్రేక్ నైపుణ్యాన్ని కోల్పోతున్న నగర యువత ప్రతిదానికీ బిడియపడుతున్న పరిస్థితులు వాట్సాప్ మెసేజ్‌లు, చాటింగ్‌తోనే భావప్రకటన కుటుంబ సభ్యులతోనూ స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి మానసిక వైద్యులను సంప్రదిస్తున్న పలువురు వాక్చాతుర్యం ఒక అద్భుతమైన కళ.. మనసులోని భావాలను, ఆలోచనలను వ్యక్తీకరించేది ‘మాట’ ఒక్కటే. పిల్లలు గలగలా మాట్లాడేస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది. మరికంత మంది తమ వాగ్ధాటితో కట్టిపడేస్తూంటారు. కానీ ఇటీవల కాలంలో మాటలు మౌనం దాల్చుతున్నాయి. మొబైల్‌ఫోన్ మాయాజాలంలో యువత కొట్టుకుపోతోంది. సూటిగా, స్పష్టంగా మాట్లాడే నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. నగరంలో ఈ తరహా ‘షైనెస్’ తీవ్ర సమస్యగా మారుతోందని పలువురు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య అనేక మందిని విస్మయానికి గురిచేస్తుంది. డిగ్రీలు, పీజీలు వంటి ఉన్నత చదువులు పూర్తి చేసిన వాళ్లు కూడా తమ భావాలను స్పష్టంగా వెల్లడించలేకపోతున్నారు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను తెలియజేసేందుకు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఏది కావాలన్నా వాట్సాప్‌లోనే.. ‘ఆ అమ్మాయికి పద్దెనిమిదేళ్లు. బీటెక్ చదువుతోంది. కానీ నోరు తెరిచి తండ్రితో నాలుగు మాటలు మాట్లాడలేదు. ఇంటికి చుట్టాలొచి్చనా పలుకరించదు. తన లోకం తనదే.. అలాగని చదువులో ఏ మాత్రం వెనుకబడకుండా బాగానే చదువుతోంది. తనకు ఏది కావాలన్నా.. తండ్రికి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుంది. ఈ ధోరణి చూస్తోంటే ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వారం రోజుల క్రితం హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతురుతో కలిసి మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించారు. అడిక్షన్తో మానసిక సమస్యలు.. ఇంటికి వచ్చిన అతిథులను కనీసం బాగున్నారా.. అని కూడా పలకరించలేని పరిస్థితి. నిజానికి ఇది కేవలం ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు.. చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిల పరిస్థితి ఇదే.. ఈ తరహా షైనెస్తో బాధపడుతున్నవారు నగరవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఇరవై నాలుగు గంటలూ మొబైల్ ఫోన్లకు అతుక్కొనిపోవడం వల్ల..బయటి ప్రపంచంతో సంబంధాలను కోల్పోతున్నారు. రోజు రోజుకు ఇలాంటి మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఈ ‘షైనస్’ (బిడియం) ఇటీవల కాలంలో ఒక సవాల్‌గా మారిందని సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సంహిత చెబుతున్నారు. ఇలాంటి పిల్లలు చదువుల్లో ఉన్నత ర్యాంకులు సాధించినప్పటికీ భావప్రకటనా నైపుణ్యంపై మాత్రం పట్టు కోల్పోతున్నారని చెబుతున్నారు. మర్యాదపూర్వకమైన సంభాషణలు, పలకరింపులు కూడా ఈ తరం పిల్లలకు తెలియకుండా పోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.పరిష్కార మార్గాలు.. అలాంటి వారితో నిత్యం ఏదో ఒక విషయంపై ఇంట్లో వారు నిరంతరం సంభాషించాలి.ఇరువై నాలుగు గంటలూ ఫోన్‌కు అతుక్కుపోయి మాట్లాడలేకపోతున్న పిల్లలను గుర్తించడంలో కుటుంబ సభ్యులు అప్రమత్తం కావాలి. అలాంటి పిల్లలను నెమ్మదిగా మాటల్లోకి దింపి సంభాషణలను పొడిగించాలి. ఇది ఒక ప్రణాళిక ప్రకారం కొనసాగించాలి. ఆ పిల్లల వాక్చాతుర్యాన్ని, భావప్రకటన నైపుణ్యాన్ని ప్రశంసించాలి. ప్రసంగాలను ప్రోత్సహించాలి. క్రమంగా మొబైల్ అడిక్షన్‌ను తగ్గించాలి అంటున్నారు మానసిక నిపుణులు. భావప్రకటనను కోల్పోతూ.. ‘ఫేస్బుక్లో, వాట్సాప్‌లో, ఇతరత్రా సమాజిక మాధ్యమాల్లో బంధువులకు, స్నేహితులకు ఎంతో ఘనంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు పోస్టు చేస్తారు. కానీ ఆయా వ్యక్తులు తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా విషెస్ కూడా చెప్పలేకపోతున్నారు.’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పిల్లలు ఆఖరికి తల్లిదండ్రులతోనూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. యువతలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. అన్నింటికీ ఇంటర్నెట్, మెబైల్ ఫోన్‌పై ఆధారపడడం, ఏదైనా సందేహం వచి్చన పెద్దలను అడగకుండా గూగుల్ లేదా ఇతర యాప్స్‌లో సెర్చ్ కొట్టడం తద్వారా వారికి కావాల్సిన సమాచారం తెలుసుకోవడం కూడా ఓ కారణమే. తద్వారా తమలోని భావప్రకటనా నైపుణ్యాన్ని కోల్పోతున్నారని తెలుస్తోంది. నిత్యం ఒంటరిగా ఫోన్‌తో కాలం గడపడం ద్వారా ఎవరితోనూ పరిచయాలు లేక.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక, ఏదైనా మాట్లాడితే ఏమంటారోననే భయంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. పదేళ్ల నుంచి పాతికేళ్ల వరకూ.. సాధారణంగా పిల్లల మాటలతోనే ఇళ్లల్లో సందడి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పదేళ్ల పిల్లల నుంచి పాతికేళ్ల యువత వరకూ ప్రతి ఒక్కరికీ మొబైల్‌ఫోన్ ఒక్కటే ప్రపంచంగా మారింది. దీంతో ఇంట్లో, బయట ఆ మొబైల్లోనే మునిగిపోతున్నారు. చివరికి రోడ్డుపై నడిచినా, బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణం చేసినా సరే మొబైలే కాలక్షేపం.. దీని కారణంగా ఇతరులతో మాట్లాడే లక్షణాన్ని కోల్పోతున్నారు.. మరీ ముఖ్యంగా తమలోని భావాలను చెప్పేందుకు, పంచుకునేందుకు తీవ్రమైన షైనెస్కు గురవుతున్నారు.‘ఇలాంటి పిల్లలు ఎదుటి వ్యక్తి ముఖంలోకి సూటిగా చూసి స్పష్టంగా మాట్లాడలేరు. ఈ షైనెస్ లక్షణం కారణంగా.. తమకు ఏం కావాలన్నా, తాము ఎదుటి వారిని ఏదైనా అడగాలనుకున్నా వాట్సాప్‌లో మెసేజ్ పోస్టు చేయడం అలవాటుగా మారుతోంది.’ అని డాక్టర్ సంహిత చెబుతున్నారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
మీ మూడ్ ని మార్చేసే పూ బాలలు.. (ఫొటోలు)
-
మూడ్‌ని మార్చి రిఫ్రెష్ అయ్యేలా చేసే సూపర్ ఫుడ్స్ ఇవే!
శరీరంలో స్రవించే హార్మోన్లలో ఒక్కోసారి చోటు చేసుకునే కొన్ని రకాల అసమతౌల్యతల కారణంగా చాలా ఒత్తిడికి లోనవుతుండటం లేదా మూడ్ ఆఫ్ కావడం మామూలే. అయితే దాన్ని సరిచేయడానికి మందులు మింగే బదులు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాలు దృఢంగా ఉంటాయి. ఆ ఆహారాలేమిటో తెలుసుకుని, మూడ్ బాగుండనప్పుడు వాటిని తీసుకుంటే సరి! మూడ్‌ని మార్చే ఫుడ్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మూడ్ పాడవుతుంది. ఏదో పోగొట్టుకున్నట్లు... వెలితిగా... ఒకలాంటి బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం వల్ల వెంటనే మూడ్ సరవుతుంది. అవేమిటో తెలుసుకుందాం... పాలకూర.. ఐరన్ పాళ్లు అధికంగా ఉండే పాలకూర సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి పనిచేస్తుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్, విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పాలకూర స్మూతీ, సూప్ లేదా పాలకూరను ఏదో ఒక రూపంలో ఆహారంలో తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్.. మష్రూమ్స్ యాంటి డిప్రెసెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ డి మానసిక స్థితిని నియంత్రిస్తుంది. ఇది సెరటోనిన్ సంశ్లేషణ స్థాయికి సంబంధించినది. దీని కారణంగా వ్యక్తి సంతోషకరమైన భావోద్వేగాలను అనుభవించగలడు. మీ మూడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, మష్రూమ్ రెసిపీని తినడం వల్ల తిరిగి మంచి మూడ్‌లోకి వచ్చేసే అవకాశం మెండుగా ఉంది. ప్రయోజనకరంగా ఉంటుంది. అవకాడో.. కొద్దికాలం క్రితం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి3 ,ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు సంతోషకరమైన హార్మోన్ అయిన సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. రోజంతా సంతోషంగా ఉండటానికి సలాడ్, శాండ్విచ్ లేదా అల్పాహారంలో అవకాడోను చేర్చవచ్చు. డ్రై ఫ్రూట్స్.. ప్రతిరోజూ కొన్ని బాదం లేదా వాల్నట్లను తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇలా జరుగుతుంది. డార్క్ చాకొలేట్.. ఓ నివేదిక ప్రకారం డార్క్ చాకొలేట్ తినడం వల్ల శరీరంలో సంతోషకరమైన హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయులను పెంచుతుంది. ఫలితంగా వెంటనే మూడ్ సరవుతుంది. మూడ్ బాగుండనప్పుడు ఈ ఫుడ్ ప్రయత్నించండి. (చదవండి: మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!) -
ఇవి తింటే మూడంతా సెట్..!!
-
భక్తి... ప్రపత్తి... సాధనాలు
ఆత్మీయం భక్తిని ఎన్నో విధాలుగా ఆచరించవచ్చు గాని, సరైన మానసిక స్థితి, శక్తి, ఓర్పు లేకపోతే ఏ మార్గమూ ఫలించదు. ఈనాడు మనం జీవితంలో ఎంతో అశాంతిని, అలజడిని, మానసిక ఉద్వేగాన్ని అనుభవిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఇదే పరిస్థితి! ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఏ ముప్పు వాటిల్లుతుందో తెలియదు. మనిషికీ మనిషికీ మధ్య ఎన్నో అడ్డుగోడలు. ఏది మంచి? ఏది చెడు? ఏది ధర్మం? ఏది అధర్మం? అనే ప్రశ్నలకి సరైన సమాధానం దొరకడం లేదు. అందువల్ల మనందరినీ సృష్టించిన ఆ పరమాత్ముణ్ని భక్తితో నిష్కల్మషమైన మనస్సుతో సేవించి, ఆయన పాద పద్మాలకే, ‘అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ’ అని శరణాగతి చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు. సుఖమయమైన, ప్రశాంతమైన పరస్పరం మానవుల మధ్య సహనం, సహకారం, సౌజన్యం, సౌహార్దం కల సాంఘిక జీవనానికి భక్తి – ప్రపత్తి అనేవే సాధనాలనేది ఎవరూ కాదనలేని సత్యం! ‘అయితే మనం భక్తి మార్గాన్ని పాటించాలా? శరణాగతిని చెయ్యాలా?’ అనే సందేహం కలిగినప్పుడు సరైన మార్గాన్ని ఉపదేశించేవారు ఆధ్యాత్మిక గురువు మాత్రమే. భక్తిని ఎన్నో విధాలుగా ఆచరించవచ్చు గాని, సరైన మానసిక స్థితి, శక్తి, ఓర్పు అనేవి లేకపోతే ఏ మార్గమూ ఫలించదు. అటువంటి పరిస్థితిలో – మహావిశ్వాసంతో – మనసా వాచా కర్మణా భగవంతుని శరణు పొందడమే సరైన మార్గం అని మనం గ్రహించాలి. ఒక వ్యక్తి పైనో, లేక దేవత పైనో, మనకి భక్తి కుదరాలంటే, మనకి ముందుగా వాళ్ల గొప్పదనం (మహాత్మ్యం) తెలియాలి. అప్పుడు మనకి, మిగతా ఎవ్వరిపైన కలగనంత తీవ్రమైన ప్రేమ (స్నేహం) ఎంతో దృఢంగా ఏర్పడుతుంది. అటువంటి మానసిక స్థితికే ‘భక్తి’ అని పేరు. భక్తి లేకపోతే ముక్తి లేదు అనిపెద్దలు నిష్కర్షగా చెప్పారు. ఈ విధంగా ఏర్పడిన భక్తి దినదిన ప్రవర్థమానమై ఉత్కృష్ట దశని చేరుకున్న వ్యక్తిని భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. ఆ వ్యక్తికి ఇహం, పరం ఆనందమయం అవుతాయి. ‘అటువంటి భక్తుడి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను’ అని శ్రీకృష్ణుడు అర్జునుడికి మాట ఇచ్చినట్లు భగవద్గీతలో చెప్పాడు. అంతేకాదు, అటువంటి వారు భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తానని కూడా చెప్పాడు. -
ఒక్కో సమస్యకు ఒక్కో‘టీ’..
మూడ్ బాగాలే నప్పుడు, కాస్త అలసటగా, మరికాస్త చిరాగ్గా అనిపించి నప్పుడు వేడివేడి టీ తాగడం చాలామందికి అలవాటే. అయితే, ఒక్కోరకం సమస్యకు ఒక్కోరకం టీ తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని లండన్‌లోని భారత సంతతికి చెందిన తేనీటి నిపుణుడు అజిత్ మదన్ చెబుతున్నారు. ఆందోళనగా ఉన్నప్పుడు, శరీరం కాస్త వేడెక్కాలనుకున్నప్పుడు దాల్చినచెక్క టీ మంచిదని, ఒత్తిడిని జయించాలనుకున్నప్పుడు లెమన్ వెర్బనా టీ సత్వరమే సత్ఫలితాలిస్తాయని ఆయన అంటున్నారు. అలాగే, పరీక్షల ముందు జ్ఞాపకశక్తిని చురుగ్గా ఉంచుకోవాలనుకునే విద్యార్థులకు గ్రీన్ టీ అత్యుత్తమమైనదని చెబుతున్నారు. మనసు బాగా లేనప్పుడు సోంపుతో తయారు చేసిన టీ తాగితే మూడ్ మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. -
గెట్ టూ...గెదర్!
న్యూఇయర్ బిగ్ పార్టీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే పార్టీ లవర్స్ ఆ మూడ్ నుంచి బయటకు వస్తున్నారు. అంత పెద్ద హంగామా నుంచి రెగ్యులర్ హ్యాంగవుట్స్కి చేంజ్ అవడం నాట్ సో ఈజీ. దాంతో పబ్స్‌లో క్రౌడ్ పలచగానే ఉంది. అటెండవుతున్నవారి మధ్య కూడా థర్టీఫస్ట్ నైట్ ఎలా గడిపాం అనేదే ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఆఫ్టర్ ఫెస్టివల్... మళ్లీ వాలెంటైన్స్ డే హంగామాకు ప్రిపేర్ అవడానికి... ఈ మంత్ఎండింగ్ వరకూ పార్టీ క్రౌడ్ సో..సో...గా స్లో...స్లోగా గడిపేయడం క్వైట్ నేచురల్. అప్పటిదాకా... లెట్ దెమ్ లేజీ. సోమాజిగూడ కిస్మత్ పబ్‌లో అతివల ఆస్వాదనం ఇది. -
చొక్కా రంగును బట్టి లైటింగ్!
సాక్షి, హైదరాబాద్: గదిలోకి రాగానే లైట్లు వాటంతటవే ఆన్.. బయటికి వెళ్లిపోగానే ఆఫ్ అవుతాయి! రోజును, మన మూడ్‌ను బట్టి గదిలోని లైట్ రంగును మార్చుకోవచ్చు! మనం ఏ రంగు చొక్కా వేసుకుంటే లైట్ కూడా అదే రంగు కాంతిని వెదజల్లుతుంది! ఇంట్లో వేసి ఉన్న లైట్లను సెల్ఫోన్ల నుంచి ఆపరేట్ చేయవచ్చు! టీవీ సౌండ్ పెంచినట్టుగా లైటింగ్‌ను కూడా ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు! .. అరే ఏంటివి అనుకుంటున్నారా? లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్ఈడీ) లైట్ల వింతలండి. రోజుకో కొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదలవుతున్న ఎల్ఈడీ లైట్ల విశేషాలపై ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజనీర్స్ (ఐఎస్ఎల్ఈ) ఏపీ చాప్టర్ చైర్మన్, లైటింగ్ కన్సల్టెంట్ డీ కృష్ణశాస్త్రితో ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేకంగా మాట్లాడింది. మరిన్ని ఆసక్తికర విషయాలివిగో.. రోజును బట్టి ఇంట్లో లైట్ రంగును మార్చుకోవాలనే అభిరుచి నగరవాసుల్లో బాగా పెరిగిపోయింది. ఇందుకు తగ్గట్టుగానే ఒకే ఎల్ఈడీ లైట్‌తో రోజుకో రంగును వెదజల్లేలా సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. బల్బు, ట్యూబ్‌లైట్లలో డే లైట్, వామ్ లైట్ అనే రెండు రంగులు మాత్రమే ఉంటాయి. అదే ఎల్ఈడీ లైట్లలో మనం కోరుకున్న రంగు మార్కెట్లో దొరుకుతుంది. అంతేకాదు ఇంట్లో గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును మార్చుకోవచ్చు. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, జువెల్లరీ, బట్టల దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారు. సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్.. ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లలో లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రకమైన ఎల్ఈడీ లైట్లు గదిలోకి రాగానే దానంతటదే లైట్ ఆన్ అవుతుంది. వెళ్లిపోగానే ఆఫ్ అవుతుంది. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లైట్ వెలుతురు (లుమిన్స్)ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు కూడా. ఇక వెబ్ బేస్డ్ సొల్యూషన్స్ ఎల్ఈడీ లైట్లయితే ఇంటర్నెట్ సహాయంతో ఐ-ఫోన్, ఐప్యాడ్ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, షామింగ్ మాల్స్‌లో వినియోగిస్తుంటారు. ధర ఎక్కువైనా.. బల్బు, సీఎఫ్ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. 18 ఓల్టుల ఎల్ఈడీ లైట్ ధర రూ. 1,500-1,800 మధ్య ఉంటుంది. 1,000 చ.అ. ఇంటికి రూ. 8 లక్షలతో వెబ్ బేస్డ్ సొల్యుషన్స్ ఎల్ఈడీ లైట్లను అమర్చుకోవచ్చు. 300 గజాల ఇండిపెండెంట్ హౌజ్ గార్డెనింగ్‌కు రూ. 3 లక్షలు ఖర్చవుతుంది. ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఫంక్షన్ హాల్‌కు రూ. 40 లక్షలు, షాపింగ్ మాల్‌కు చదరపు అడుగుకు రూ. 500 నుంచి రూ. 1,000 వరకు ఖర్చవుతుంది. నెలకు రూ.7 కరెంట్ బిల్లు.. ఎల్ఈడీ లైట్లు విద్యుత్‌ను చాలా తక్కువగా తీసుకుంటాయి. రోజుకు 10 గంటల చొప్పున బల్బును నెల రోజుల పాటు వినియోగిస్తే 27 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే నెలకు రూ. 39.15 పైసలు కరెంట్ బిల్లు వస్తుంది. (డొమెస్టిక్ వినియోగంలో యూనిట్ విద్యుత్‌కు రూ. 1.45 పైసలుగా ఉంది) ట్యూబ్‌లైట్ విషయానికొస్తే.. నెలకు 21 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే రూ. 30.45 పైసలు బిల్లు వస్తుంది. అదే ఎల్ఈడీ లైట్‌కు అయితే నెలకు కేవలం 5 యూనిట్లే ఖర్చవుతుంది. అంటే రూ. 7.25 పైసలు మాత్రమే కరెంట్ బిల్లు వస్తుందన్నమాట. లాభాలెన్నో.. ఎల్ఈడీ లైట్‌కు 5 ఏళ్ల పాటు గ్యారెంటీ ఉంటుంది. బల్బును నిరంతరాయంగా 500 గంటల పాటు వేసి ఉంచితే పాడవుతుంది. ట్యూబ్‌లైట్ అయితే వెయ్యి గంటలు, కానీ ఎల్ఈడీ లైట్‌ను నిరంతరాయంగా 25 - 50 వేల గంటల పాటు వేసి ఉంచినా ఏం కాదు. అవసరానికి తగ్గట్టుగా ఎల్ఈడీ లైట్ల వెలుతురు (లుమిన్స్)ను తగ్గించుకోవచ్చు. ఒకే ఎల్ఈడీ లైట్‌ను మనకు కావాల్సిన రంగు ఎల్ఈడీ లైట్‌గా మార్చుకోవచ్చు. యూనిట్ విద్యుత్ వినియోగం వస్తువు ఓల్టులు విద్యుత్ బల్బు 100 11 గంటలు ట్యూబ్‌లైట్ 52(ట్యూబ్+చౌక్) 21 గంటలు ఎల్ఈడీ 18 60 గంటలు


