చెమటతో చార్జింగ్‌ | Could we charge our phones using SWEAT | Sakshi
Sakshi News home page

చెమటతో చార్జింగ్‌

Jun 24 2017 12:11 PM | Updated on Sep 5 2017 2:22 PM

చెమటతో చార్జింగ్‌

చెమటతో చార్జింగ్‌

మనుషుల స్వేదాన్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జ్‌ చేసేసాంకేతి కతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు

లాస్‌ఏంజిలెస్‌: మనుషుల స్వేదాన్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జ్‌ చేసేసాంకేతి కతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చర్మానికి అంటిపెట్టుకొని ఉండేలా పట్టీ(స్కిన్‌ పాచ్‌)ని  రూపొందించారు.

సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే లోహాలను కాకుండా ఈ స్కిన్‌ పాచ్‌లో ఎంజైమ్స్‌ను ఉపయోగించామని దీన్ని అభివృద్ధి చేసిన  కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెప్పారు. చెమటలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ను ఉపయోగించుకుని పరికరంలో అమర్చిన బయో ఫ్యూయల్‌ సెల్స్‌ చార్జ్‌ అవుతాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement