16 Years Old Boy Commits Suicide After Being Scolded By Mother For Over Usage Of Phone - Sakshi
Sakshi News home page

‘ఇక చూసింది చాలు పడుకో’ అని తల్లి అనడంతో..

Jun 26 2023 10:05 AM | Updated on Jun 26 2023 11:29 AM

Mother Refused to Use the Phone - Sakshi

ఆ 16 ఏళ్ల కుర్రాడు పొద్దస్తమానం పోన్‌ చూస్తుండాన్ని  గమనించిన తల్లి అతనిని మందలించింది. దానిని తట్టుకోలేకపోయిన ఆ కుర్రాడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన యూపీలోని ఇటావా పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల రాజు(మార్చిన పేరు) రాత్రంతా మేలుకుని ఫోను చూస్తుండటంతో అతని తల్లి మందలించింది. ‘ఇక చూసింది చాలు పడుకో’ అంటూ అతని నుంచి ఫోను లాక్కొన్ని, స్విచ్‌ ఆఫ్‌ చేసింది. అయితే రాజు తన మొండి పట్టుదల వీడక పోను ఇంకా చూస్తానని మొండికేశాడు. 

అమ్మ లాగిపెట్టి కొట్టిందని..
కుమారుని మొండితనాన్ని చూసిన తల్లి ఆగ్రహంతో అతని చెంప చెళ్లుమనిపించింది. దీంతో రాజు ఆ ఫోనును నేలకేసి పగులగొట్టి, గది తలుపులు వేసుకున్నాడు. కొద్దిసేపటి తరువాత రాజు చెల్లెలు.. గదిలో నుంచి బయటకు రమ్మని అతనిని కోరింది. అరగంట గడిచినా గదిలో నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో రాజు తల్లి అనుమానంతో కిటికీలో నుంచి గదిలోకి తొంగి చూసింది. లోపల రాజు ఫ్యానుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే తల్లి గట్టిగా కేకలు వేసింది.

కిందకు దింపి ఆసుపత్రికి తరలించగా..
కుమారుడు ఉన్న స్థితిని చూసిన తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వారి ఇంటికి చేరుకున్నారు. వారు గది తలుపులు బద్దలుకొట్టి, రాజును కిందకుదించి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, రాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ వార్త వినగానే రాజు తల్లి పెద్దపెట్టున రోదించసాగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని,మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్‌ వెనుక సింపుల్‌ లాజిక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement