జెన్‌ జీకి బెస్ట్‌... 5జీ ఫోన్లలో చీపెస్ట్‌! | Top 5 Budget 5G Smartphones Under Rs 15000 For Gaming Reels Trending On Social Media, Check Out More Details | Sakshi
Sakshi News home page

జెన్‌ జీకి బెస్ట్‌... 5జీ ఫోన్లలో చీపెస్ట్‌!

Jun 11 2026 9:28 AM | Updated on Jun 11 2026 6:14 PM

Top 5 Budget 5G Smartphones Under Rs 15000 for Gaming Reels Social Media

దేశీ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ లావా సరికొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. షార్క్‌-2 5జీ పేరుతో విడుదలైన ఈ ఫోన్‌ ధర కేవలం 11,999 రూపాయలు. 5జీ ఫోన్లలోకెల్లా అత్యంత చౌకది కావడం ఒక విశేషం. అలాగనీ ఇందులో ఫీచర్లకు, హంగు, ఆర్బాటాలకేమీ కొదవలేదు. అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన విషయం దీని బ్యాటరీ గురించి. ఆరువేల ఎంఏహెచ్‌ బ్యాటరీతో లభించే ఈ ఫోన్‌తో ఏకంగా 13 గంటల 35 నిమిషాలపాటు యూట్యూబ్‌ వీడియోలు చూసుకోవచ్చునని కంపెనీ చెబుతోంది.

స్క్రీన్‌ విషయానికి వస్తే... 120 హెర్ట్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో హెచ్‌డీ-ఎల్‌సీడీ డిస్‌ప్లే లభిస్తుంది. స్క్రీన్‌ సైజు దాదాపు 6.75 అంగుళాలు. సోనార్‌ గోల్డ్‌, ఆర్యా బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. లావా షార్క్‌-2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరు నానోమీటర్ల యూనీసాక్‌ టీ8200 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నాలుగు జీబీల ర్యామ్‌కు అదనంగా 4 జీబీల వర్చువల్‌ ర్యామ్‌ అందుబాటులో ఉంది. ఫిజికల్‌ మెమరీ విషయానికి వస్తే 64 గిగాబైట్లు లభిస్తుంది. లావా షార్క్‌-2 5జీ ఫోన్‌ ఏఐ ఆధారిత 13 మెగాపిక్సెల్‌ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కెమెరా రెజల్యూషన్‌ 5 మెగాపిక్సెల్స్‌.

రూ.15,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్లు

ఫోన్‌ధర (రూపాయల్లో)స్క్రీన్బ్యాటరీ(mAh)కెమెరా(మెగా పిక్సెల్స్)
రెడ్‌మీ నోట్ 14 ఎస్ఈ13,9996.67, AMOLED (120Hz)511050 MP + 2 MP
మోటో జీ57 పవర్13,9996.72, FHD+ LCD (120Hz)700050 MP + 8 MP
సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం1714,9996.7, Super AMOLED500050 MP + 5 MP + 2 MP
ఐకూ 14,5006.7, LCD (120Hz)600050 MP
సీఎంఎఫ్ నథింగ్ ఫోన్ 114,6656.7, FHD+ (Dimensity 7300)500050 MP + 2 MP

గమనిక: రిటైలర్‌, సెల్లర్‌ ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: హ్యాట్రిక్‌ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement