Mobile World Congress: ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్‌

Infinix Concept Phone 2021 With 160W Charging, Colour Changing Panel  - Sakshi

మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈసారి అందరి దృష్టి  ఇన్ఫినిక్స్‌ కాన్సెప్ట్‌ 2021 ఫోన్‌పై పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ఫోన్‌లో ఫీచర్స్‌ని ఇన్ఫినిక్స్‌ చేర్చింది. 

రంగులు మార్చేస్తుంది
డ్యూయల్‌ కలర్‌ ఛేంజింగ్‌ బ్యాక్‌ కవర్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఇన్ఫినిక్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌ కలర్‌ మారుతుందని ఇన్ఫినిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ జెస్సీ ఝాంగ్‌ తెలిపారు. గతంలో ఈ తరహా ఫీచర్‌తో ఏ ఫోన్‌ రాలేదు. ఒక రకంగా ఈ ఫోన్‌ ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది. 

క్రేజీ ఫీచర్లు
యువతను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లను ఇన్ఫినిక్స్‌ తన రాబోయే ఫోన్‌లో జోడించనుంది. అందులో కలర్‌ ఛేంజింగ్‌ బ్యాక్‌ ప్యానెల్‌తో పాటు 4000 mAh బ్యాటరీ  అందివ్వనుంది దీనికి తోడుగా 160 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల 10 నిమిషాల్లోనే ఈ ఫోన్‌ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. 50 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ అందివ్వనుంది. 3డీ గ్లాస్‌ కవరింగ్‌, 60 ఎక్స్‌ జూమ్‌ వంటి ఫీచర్లు అందించింది. అంతేకాదు ఫోన్‌ ఎక్కువగా వాడుతున్నా... ఛార్జింగ్‌ చేసే సమయంలో వేడెక్కకుండా ఉండే టెక్నాలజిని ఉపయోగిస్తున్నట్టు ఇన్ఫినిక్స్‌ తెలిపింది. 

చదవండి : Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top