
ఎక్కడైనా ఒకసారి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నామంటే.. దాన్ని తిరిగి పొందటం దాదాపు అసాధ్యం. అయితే ఓ జంట మాత్రం యూపీఐ సాయంతోనే పోయిన ఫోన్ పొందగలిగింది. ఇది వినడటానికి వింతగా అనిపించినా.. అసలు విషయం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.
నా భార్య ఫోన్ తిరిగి పొందడంలో యూపీఐ సహాయపడింది అనే శీర్షికతో.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఈ రోజు నేను, నా భార్య ఆటోలో షాపింగ్‌కి వెళ్ళాము, గమ్యం చేరుకున్న తరువాత.. ఆటోకు యూపీఐ ద్వారా డబ్బులు పంపించాను. ఆటో వెళ్లిపోయింది. ఆ తరువాత చూస్తే నా భార్య ఫోన్ కనిపించలేదు. ఆ ఫోన్‌కు కాల్ చేద్దామంటే.. అప్పటికి అందులో సిమ్ కార్డు వేయలేదు.

మొదట్లో ఫోన్ ఎవరో దొంగలించి ఉంటారనుకున్నాము, తరువాత ఆలోచిస్తే ఆటోలో మారిపోయినట్లు గుర్తొచ్చింది. ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకుందామంటే.. స్కాన్ చేసి డబ్బు పంపించడం వల్ల అది సాధ్యం కాలేదు. మొత్తానికి ఫోన్ పోయింది అనుకున్నాము. ఇంతలో నా బ్యాంక్ ఖాతాకు ఒక్కరూపాయి యూపీఐ నుంచి వచ్చింది. అంతే కాకుండా పోయిందనుకుంటున్న ఫోన్ నా దగ్గర ఉంది అని.. ఒక నెంబర్ పంపి, దానికి కాల్ చేయమని మెసేజ్ వచ్చింది. మేము ఆ నెంబరుకు కాల్ చేసి.. ఎక్కడ ఉన్నారు అని కనుక్కున్నాం. కానీ ఆ ఆటో డ్రైవర్ మా దగ్గరకు వచ్చి ఫోన్ ఇచ్చాడు. మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆటో డ్రైవరుకు కొంత డబ్బు కూడా ఇచ్చి పంపాను అని రెడ్డిట్ పోస్టులో వెల్లడించారు.
ఇదీ చదవండి: జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: మొదటి రోజే భారీగా అమ్ముడైన కార్లు