రాకెట్ సక్సెస్ కాల్‌లో బయటపడ్డ మోదీ ఫోన్ సీక్రెట్ ట్యూన్! | Patriotism on Hold The Modi Caller Tune Mystery | Sakshi
Sakshi News home page

రాకెట్ సక్సెస్ కాల్‌లో బయటపడ్డ మోదీ ఫోన్ సీక్రెట్ ట్యూన్!

Jul 20 2026 8:45 AM | Updated on Jul 20 2026 9:03 AM

Patriotism on Hold The Modi Caller Tune Mystery

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌కు ‘వందేమాతర కాలింగ్ ట్యూన్’ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. స్కైరూట్ ఏరోస్పెస్ శాస్త్రవేత్తలు ప్రైవేట్ రాకెట్ ప్రయోగ విజయానంతరం ప్రధానికి కాల్ చేసినప్పుడు ఈ  ట్యూన్ వినిపించింది. అయితే ఇది ప్రధాని వ్యక్తిగత ట్యూన్ కాదని, అత్యున్నత అధికారిక నంబర్ల కోసం కేటాయించిన ప్రత్యేక రింగ్ బ్యాక్ ట్యూన్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
 

భద్రతా కారణాలరీత్యా వీఐపీల అధికారిక నంబర్లపై సాధారణంగా ఎలాంటి పాటలు ఉండవు. ప్రభుత్వ టెలికాం నెట్‌వర్క్‌ల నిబంధనల ప్రకారం జాతీయ భావనను చాటే ఇలాంటి ట్యూన్‌లను ప్రత్యేక ప్రొటోకాల్ కింద సెట్ చేస్తుంటారు. సామాన్య ప్రజలు కూడా తమ ఫోన్లలో ఈ ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు. జియో సావన్, వింక్ మ్యూజిక్ లేదా వీఐ యాప్‌లను ఓపెన్ చేసి, కాలర్ ట్యూన్స్ సెక్షన్‌లో ‘వందేమాతరం ఇన్‌స్ట్రుమెంటల్’ లేదా ‘ఫ్లూట్’ వెర్షన్‌ను వెతికి సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా.. ప్రశాంత్ కిషోర్ సవాల్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement