పెళ్లి కాకుండానే తల్లిని చేసిన ఘనుడు! | boyfriend refuses marriage woman protests with newborn mudigunta | Sakshi
Sakshi News home page

పెళ్లి కాకుండానే తల్లిని చేసిన ఘనుడు!

Apr 18 2026 10:04 AM | Updated on Apr 18 2026 10:04 AM

boyfriend refuses marriage woman protests with newborn mudigunta

 ప్రియుడి ఇంటి ఎదుట నాలుగురోజుల 

బాబుతో బాధిత యువతి బైఠాయింపు!

న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకోలు 

జైపూర్‌: పెళ్లికి ముందే ఓ యువతి బాబుకు జన్మని చ్చింది. ఇందుకు కారణమైన యువకుడు పెళ్లికి నిరాకరించాడని ఆరోపించింది. నాలుగు రోజుల బా బుతో యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని ముదిగుంట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ముదిగుంటకు చెందిన బాధితురాలు నీలిమ మాట్లాడుతూ.. తమ గ్రామానికే చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ సాయిరాజ్‌ తనను రెండుళ్లుగా ప్రేమించాడని ఆరోపించింది. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకో గా గర్భం దాల్చానని పేర్కొంది. డెలివరీ సమయంలో తనతో ఫోన్లో మాట్లాడాడని, బాబు పుట్టాక వీడియా కాల్‌ కూడా మాట్లాడినట్లు ఆరోపించింది. బాబు పుట్టిన నుంచి తనను దూరం పెట్టాడని తెలిపింది. పెళ్లికి నిరాకరిస్తున్నాడని, ఫోన్లో కూడా స్పందించడం లేదని వాపోయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయిరాజ్‌ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement