మార్కెట్‌లో విడుదల కానున్న బడ్జెట్‌ ఫోన్‌ | Infinix Has Been On A Launch Infinix Hot 11s | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో విడుదల కానున్న బడ్జెట్‌ ఫోన్‌

Aug 29 2021 2:19 PM | Updated on Aug 29 2021 2:19 PM

Infinix Has Been On A Launch Infinix Hot 11s - Sakshi

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్‌ చేసేందుకు సిద్ధమైంది. వచ్చే (సెప్టెంబర్‌) నెలలో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11ను విడుదల చేయనున్నట్లు స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.  

ఇప్పటికే ఇన్ఫినిక్స్‌ నోట్‌ 7, ఇన్ఫినిక్స్‌ హాట్‌ 9,  ఇన్ఫినిక్స్‌ హాట్‌ 10ఎస్‌ బడ్జెట్‌ ఫోన్లతో  రూరల్‌ ఇండియాను టార్గెట్‌ చేస్తున్న ఇన్ఫినిక్స్ సంస్థ  తాజాగా ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 విడుదల ప్రకటనతో ఆఫోన్‌ ఫీచర్లు, ధర ఎంత? అనే విషయంపై స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లు ఆసక్తిని కనబరుస్తున్నారు.ప్రస్తుతం ఆన్‌ లైన్‌లో విడుదలైన ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి. 

ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 ఫీచర్లు
రెండు మెమరీల వేరియంట్‌ తో 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్,6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోర్‌తో ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 ధర రూ.9,999గా ఉండగా నుంది.  మీడియాటెక్ హెలియో G88 సిస్టమ్-ఆన్-చిప్ తో అందుబాటులోకి రానుండగా.. పూర్తి స్థాయిలో ఫీచర్లను ఇన్ఫినిక్స్‌ సంస్థ విడుదల చేయలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement