ఫోన్‌లో విసిగించిందని భార్యపై దాడి 

Husband Attacks Wife In Anantapur - Sakshi

అనంతపురం క్రైం: ఇంటికి త్వరగా రమ్మని ఫోన్‌లో విసిగించిందని భార్యపై రాడ్‌తో దాడి చేసి గాయపరిచిన భర్త ఉదంతం వెలుగుచూసింది. రుద్రంపేటలో వెల్డింగ్‌ వర్కర్‌ టోపీఖాన్, చంద్రకళ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. మంగళవారం రాత్రి ఎంతసేపటికీ భర్త ఇంటికి రాకపోవడంతో చంద్రకళ పలుమార్లు ఫోన్‌ చేసింది. తర్వాత తప్పతాగి ఇంటికి చేరుకున్న టోపీఖాన్‌ ఫోన్‌ చేసి తనను విసిగిస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయి రాడ్‌తో భార్యపై దాడిచేశాడు. గొంతుపై కాలుతో తొక్కాడు. ఘటనపై బాధితురాలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు టోపీఖాన్‌పై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. చదవండి: డబుల్‌ మర్డర్‌: భూతవైద్యుడి ఎంట్రీ.. కేసు కీలక మలుపు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top