ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్‌? | Woman Missing In Hyderabad | Sakshi
Sakshi News home page

ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావ్‌?

Jun 22 2026 2:03 PM | Updated on Jun 22 2026 2:24 PM

Woman Missing In Hyderabad

హైదరాబాద్‌: భర్త మందలించడంతో భార్య ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన సంఘటన ఆదివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం, నాగారానికి చెందిన పెంట శ్రీను తన భార్య రమాదేవి ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుందని మందలించాడు. 

దీంతో మనస్థాపం చెందిన భార్య ఈ నెల 19న హెచ్‌బీకాలనీలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. మరుసటి రోజు భర్త శ్రీను హెచ్‌బీకాలనీకి వెళ్లి చూడగా, భార్య అక్కడే ఉంది. అదేరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరకి చెప్పకుండా బయటకు వెళ్లిన రమాదేవి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికిన ఫలితం లేకపోవడంతో ఆదివారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement