Gas Cylinders Supply
-
ఇక గ్యాస్ అవసరం లేదా? డీజిల్ స్టవ్‌తో సంచలనం!
జనగామ జిల్లా: ‘అవసరమే ఆవిష్కరణకు మూలం’ అని మరోసారి నిరూపితమైంది. పెరిగిపోతున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలతో బతుకు బండిని లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక హోటల్ నిర్వాహకుడు, తన స్వయంకృషితో ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు. డీజిల్‌తో పని చేసే ప్రత్యేక స్టవ్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫాస్ట్‌ఫుడ్ హోటల్ నడపుతున్న గుండు వసంత్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన చెందాడు. దీనికి ప్రత్యామ్నాయంగా సుమారు రూ.1,300 ఖర్చుతో, రెండు రోజులపాటు శ్రమించి ఈ డీజిల్ పొయ్యిని రూపొంచాడు. ఈ వినూత్న పొయ్యిలో విద్యుత్‌తో నడిచే బ్లోయర్‌ను అమర్చారు. ఆ బ్లోయర్ మోటార్ ద్వారా వచ్చే గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్‌ను మరో పైపు ద్వారా పొయ్యి వద్దకు పంపించి మంట వచ్చేలా అమర్చాడు. అవసరాన్ని బట్టి మంటను పెంచుకోడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా బ్లోయర్లో రెగ్యులేటర్ కూడా అమర్చారు. సాధారణ గ్యాస్ సిలిండర్‌తో పోలిస్తే ఈ డీజిల్ పొయ్యి వల్ల ఖర్చు కూడా సగానికి పైగా తగ్గుతుందని వసంత్ చెబుతున్నారు. లీటర్ డీజిల్‌తో గంట నుంచి రెండు గంటలపాటు నిరంతరంగా పోయి మండుతుందని ఆయన తెలిపారు. వసంత్ ఆవిష్కరణను చూసిన మరి కొందరు హోటల్ నిర్వాహకులు తమ కోసం కూడా ఇలాంటి పొయ్యిలను తయారు చేయించుకోవడం విశేషం. సామాన్యుడి మేధస్సుతో పుట్టిన ఈ దేశీ ఆవిష్కరణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.గ్యాస్ కొరతను అధిగవిుంచాను.. పొరుగు దేశాల్లో యుద్ధం నేపథ్యంలో నిత్యావసర సరుకులతోపాటు ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. ఖర్చులు పెరుగుతుండడంతో కొత్త మార్గం కోసం ఆలోచించాను. అప్పడు డీజిల్‌తో పని చేసే పొయ్యి తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తక్కువ ఖర్చుతో రెండు రోజుల్లోనే తయారు చేసాను. లీటర్ డీజిల్ సాయంతో సుమారు రెండు గంటలపాటు పొయ్యి మండుతుంది. ఇప్పుడు ఖర్చు తగ్గింది. పని సులభమైంది. – గుండు, వసంత్,ఫాస్ట్‌ఫుడ్ హోటల్ నిర్వాహకుడు -
ప్రజలకు చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు
-
Shamirpet: ఖాళీ సిలిండర్... క్యూలోమీటర్
మేడ్చల్ రూరల్/గోల్కొండ: వంటగ్యాస్‌కు తంటాలు తప్పడంలేదు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లోని ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద గురువారం వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో కిలోమీటర్ మేర క్యూ కట్టారు. సుమారు 500 మందికి పైగా రాజీవ్ రహదారి వరకూ బారులు తీరారు. బుకింగ్ చేసి 20 రోజులవుతున్నా సరఫరా చేయడంలేదని ఆరోపించారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి గ్యాస్ ఏజన్సీ కార్యాలయానికి వచ్చి పరిస్థతిని పరిశీలించారు. కొరత లేదని బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ సిలిండర్ అందజేస్తామని తెలిపారు. సిలిండర్ల కోసం షేక్‌పేట్‌లోని గోదాముల వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం షేక్‌పేట్ నాలా మాధవి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఒకరినొకరు తోసుకుంటూ సిలిండర్లు తీసుకెళ్లేందుకు సిద్ధపడగా నియంత్రించి సర్దిచెప్పారు. -
ఫుల్లుగా పెట్రోల్.. అయినా ఉరుకులాటెందుకు?
హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం వాహనదారులు ఎగబడుతున్నారు. ఒకరిని చూసి ఒకరు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నిజానికి వాహనదారులు పెట్రోలు బంకుల వద్దకు అంత భారీగా వెళ్తూ ఫుల్ ట్యాంకు నింపించుకుంటున్నారు కాబట్టి కొన్ని బంకుల్లో పెట్రోల్ అయిపోతుంది. దీంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. లేని ప్రమాదాన్ని ఊహించుకుని ఆందోళన చెందుతున్నట్లు ఉంది వాహనదారుల తీరు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లోని పలు నగరాల్లో ప్రజల్లో భయం, ఆందోళన పెరిగాయి. ఏ అనుకోని పరిస్థితి వస్తుందోనన్న భయంతో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.ప్రభుత్వ వివరణ ఇదే..ఇరాన్ యుద్ధం వేళ క్రూడాయిల్ సరఫరా కొంత తగ్గినప్పటికీ ఇప్పుడు ఆ లోటు పూర్తిగా భర్తీ అయింది. హార్మూజ్ జలసంధి వద్ద ప్రతికూల పరిస్థితి ఉన్నా, భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 41కి పైగా సరఫరాదారుల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇంతకు ముందు హార్మూజ్ జలసంధి ద్వారా వచ్చిన దానికంటే ఎక్కువ క్రూడాయిల్‌ను భారత్ పొందుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో (ముఖ్యంగా పశ్చిమ గోళార్థంలోని దేశాల్లో) క్రూడాయిల్ పెద్ద మొత్తంలో ఉంది. ఇతర ప్రాంతాలనుంచి సరఫరా జరగకపోతే వేరే మార్కెట్ల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవచ్చు. ప్రతి భారత రిఫైనరీ 100% కంటే ఎక్కువ వినియోగంతో నడుస్తోంది. భారత ఆయిల్ కంపెనీలు వచ్చే 60 రోజుల దేశ అవసరాలకు సరిపడే క్రూడాయిల్ సరఫరాల కోసం ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. కాబట్టి దేశంలో లోటు ఉండే ప్రమాదం లేదు. సరఫరాలో ఎలాంటి లోటు లేదు.ఈ రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇదే..పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు ఎంతగా చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు, పలు నగరాల్లో పెట్రోల్ బంకులకు వాహనదారులు భయంతో వెళ్తున్నారు. ఇంధన లోటు ఉందేమోనన్న భయంతో ప్రజలు పొడవాటి క్యూల్లో నిలబడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. -
భారత్‌కు అండగా మరో దేశం.. పెద్ద కష్టం తీరినట్టే?
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అనేక దేశాలు ఇంధన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధి మూత పడటంతో పెను సంక్షోభం ఏర్పడింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. దీంతో, చమురు సరఫరా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రభావం భారత్‌పై కూడా తీవ్రంగా పడింది.కాగా, భారత్ తన అవసరాల కోసం దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే ఎల్పీజీని దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌కు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి మూత పడటంతో సమస్య తలెత్తింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ మిత్రదేశమైన అర్జెంటీనా భారత్‌కు భారీ ఆఫర్ ఇచ్చింది. 2024 కంటే ముందు అర్జెంటీనా నుంచి భారత్‌కు గ్యాస్ సరఫరా అస్సలు ఉండేది కాదు. కానీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2025లో 22,000 టన్నుల దిగుమతులు జరగగా, 2026 తొలి మూడు నెలల్లోనే అది ఏకంగా 50,000 టన్నులకు చేరడం గమనార్హం. మార్చి 5న అదనంగా 11,000 టన్నులు గ్యాస్‌తో భారత్ చేరుకుంది.అయితే, అర్జెంటీనా దక్షిణ అమెరికా ఖండం చివరిలో ఉంది. భారత్, అర్జెంటీనా మధ్య దూరం సుమారు 20,000 కిలోమీటర్లు. అక్కడి నుంచి భారత్‌కు రవాణా చేయడం పెను సవాలుతో కూడుకుంది. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అత్యంత పొడవైన నౌకా మార్గం ఇది. రవాణా ఖర్చులు భారమైనప్పటికీ, దేశంలో గ్యాస్ కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కౌసినో ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ దేశంలో అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని, భారత్‌కు దీర్ఘకాలం పాటు సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రస్తుతం భారత్ అర్జెంటీనాకు 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గ్యాస్‌తో పాటు సోయాబీన్ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, పప్పుధాన్యాలను కూడా మనం అక్కడి నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. -
సిలిండర్ అందుబాటు గ్యాసే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గ్యాస్ ఇక్కట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. షేక్‌పేట్‌లోని మాధవి గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం వినియోగదారులు గంటలతరబడి వేచి చూడడం కన్పించింది. సిలిండర్ కోసం 8 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని, గత రెండు రోజులుగా ఏకంగా ఏజెన్సీ వద్దకు వచ్చి లైన్లో నిలబడినా లభించలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరూ ఈ విధంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దీనిపై స్పందించడం లేదని, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత లేదని కొందరు వినియోగదారులు మండిపడ్డారు. ఎవరికి సిలిండర్లు అందిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు. -
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఖతార్‌లోని అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ రాస్ లాఫ్ఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ తమపై చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ దాడి చేసింది. అలాగే, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తుండడంతో భారత్ వంటి దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులు ఉన్న దేశాలు ఇరాన్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఫ్యాక్టరీపై దాడి జరిగిన వెంటనే అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా ఎల్ఎన్జీ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖతార్‌పై ఇరాన్ దాడి మొదటి సారికాదు. మార్చి మొదటి వారంలో ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపింది. ఖతార్ గ్యాస్ క్షేత్రాలు, రాస్ లాఫ్ఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్‌పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు.. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా జరిగినవని సమాచారం.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ నాయకత్వంపై వరుస దాడులు చేశాయి. తాజా దాడిలో గూఢచారి విభాగం అధిపతి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యాడు. ఇరాన్లో వేల సంఖ్యలో మరణాలు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలను తగ్గిస్తోంది.భారత్‌పై ప్రభావం ఈ పరిస్థితులు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం ఖతార్ నుంచే వస్తుంది.“భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% విదేశీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంది. అందులో సుమారు 40% ఎల్ఎన్జీ ఖతార్ నుంచి వస్తుంది. అంటే మొత్తం దిగుమతుల్లో దాదాపు 20 శాతం కతార్ నుంచే. భారత్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ రంగంలో వినియోగం తగ్గించాలి” అని ఇంధన ఆర్థిక నిపుణుడు కిరిట్ పారిఖ్ తెలిపారు.ప్రస్తుతం భారత్ రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతుంది.గత వారం నాటికి 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది దిగుమతుల్లో భాగం. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితుల వల్ల ఈ అంతరాయం జరిగింది. దీంతో ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ఇతర సోర్సుల నుంచి ఎల్ఎన్జీ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. -
గ్యాస్ సరఫరాలో ఎగుమతి యూనిట్లకు ప్రాధాన్యం
ఎగుమతి ఆధారిత తయారీ యూనిట్లకు ప్రాధాన్య ప్రాతిపదికన ఎల్పీజీ, సహజ వాయువును కేటాయించాలని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇంధన కొరత ఏర్పడితే భారతీయ సంస్థలు సకాలంలో ఎగుమతుల లక్ష్యాలను పూర్తి చేయలేవని.. దీంతో అంతర్జాతీయ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ దేశాల వైపు మళ్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చైనా ప్రయోజనం పొందొచ్చని పేర్కొంది. కనుక ఎగుమతి ఆధారిత తయారీ పరిశ్రమలకు గ్యాస్ సరఫరా కొనసాగేలా చూడడం ఎంతో అవసరమని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ తెలిపారు.ఈ విషయమై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలకు లేఖ రాసినట్టు చెప్పారు. ఎగుమతులపై ఆధారపడిన చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) సైతం గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం చూపించాలని కోరారు. ఎగుమతిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత.. పశి్చమాసియాలో సంక్షోభ వాతావరణం నెలకొనడం తెలిసిందే. దీంతో చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి.గ్యాస్ కొరత ఏర్పడడంతో వంటగ్యాస్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. పరిశ్రమలకు ఇప్పటికే 50 శాతానిక పైనే గ్యాస్ కోత విధించడం గమనార్హం. జలంధర్ కేంద్రంగా పనిచేసే హ్యాండ్ ఉపకరణాల తయారీదారులు, ఎగుమతిదారుల సమాఖ్య ప్రెసిడెంట్ అశ్వినీ కుమార్ సైతం ఇదే మాదిరి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తి కోసం రోజువారీ 425 కిలోల ఎల్పీజీ, కార్మికుల ఆహార తయారీకి వీలుగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా ఎంతో అవసరమని చెప్పారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ
కొచ్చి: పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభపు సెగ వంటగదులనూ తాకింది. కేరళలోని కొచ్చి నగరంలో ఎల్పీజీ (LPG) కొరత తీవ్రం కావడంతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెట్టారు. గ్యాస్ కొరతతో ఏయే హోటళ్లు మూతపడ్డాయి? ఎక్కడ భోజనం దొరుకుతుంది? అనే వివరాలను ఇట్టే చెప్పేసే ఒక వినూత్న వెబ్‌సైట్‌ను వారు అందుబాటులోకి తెచ్చారు.చేదు అనుభవం.. సరి కొత్త ఆలోచనవైశాఖ్ సురేష్, వి. విశ్వనాథ్ కర్త అనే ఇద్దరు టెక్కీలు ఇటీవల తమ టీమ్ సభ్యులతో కలిసి డిన్నర్‌కు వెళ్లారు. 30 మంది ఉన్న ఆ బృందానికి నగరంలోని ప్రధాన హోటళ్లలో ఆహారం లభ్యం కాలేదు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంటలు నిలిచిపోయాయని తెలుసుకున్నారు. కావాల్సిన ఆహారం దొరకక, నగరం అంతా తిరగాల్సి రావడంతో వారికి గంటల కొద్దీ సమయం, ఇంధనం వృథా అయ్యాయి. ఈ ఇబ్బంది మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో ‘గ్యాస్ అన్డూ’ ‘Gas Undo’ (https://www.gasundo.live/) పేరుతో ఒక వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.లైవ్ మ్యాప్‌తో ఆహారం వేట సులభంఈ వెబ్సైట్ ఒక డిజిటల్ మ్యాప్ మాదిరిగా పనిచేస్తుంది. కొచ్చి నగరంలోని దాదాపు 2,488 రెస్టారెంట్ల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఏ హోటల్ ప్రస్తుతం ఏమి ఆహారం దొరుకుతుంది? ఎక్కడ పరిమితమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉంది? తదితర వివరాలను రియల్ టైమ్‌లో ఈ వెబ్పసైట్ ద్వారా తెneighboursలుసుకోవచ్చు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌవ్‌లు లేదా కట్టెల పొయ్యిలకు మారిన హోటళ్ల సమాచారాన్ని కూడా ఇందులో చూడవచ్చు.ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యంఈ ప్లాట్‌ఫారమ్ విశేషమేమిటంటే ఇది పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుంది. ఏదైనా హోటల్‌కు వెళ్లిన కస్టమర్లు అక్కడ ఆహారం అందుబాటులో ఉందో లేదో వెంటనే మ్యాప్‌లో అప్డేట్ చేయవచ్చు. దీనివల్ల వేరే వాళ్లు ఆ హోటల్‌కు వెళ్లి, నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. సాంకేతికతను సామాన్యుల కష్టాలను తీర్చడానికి ఎలా ఉపయోగించవచ్చో ఈ కేరళ టెక్కీలు చక్కగా నిరూపించారు.ఇది కూడా చదవండి: అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ! -
ఇక సిలిండర్లతో పరేషాన్ వద్దు... 5 బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్ లు
-
వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: వంటగ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్‌లో గ్యాస్ సంక్షోభం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్యానిక్ బుకింగ్స్ వద్దని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ కోరారు. అవసరం లేకున్నా ఆందోళనతో గ్యాస్ బుక్ చేయొద్దన్నారు. బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకుంటున్నామన్న పెట్రోలియం శాఖ.. గ్యాస్ అందుబాటులో ఉందని.. ఆందోళన అక్కర్లేదని పేర్కొంది. దేశంలో పెట్రోల్ కొరత కూడా లేదని.. 30 శాతం ఎల్పీజీ ఉత్పత్తి పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ఎల్పీజీ బదులు ప్రజలు పీఎన్జీ తీసుకోవాలని.. ఎప్పటిలాగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్న ప్రజలు.. భారీగా పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ గోడౌన్ల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటల్స్‌లలో నుంచి మెనూ మార్చేశారు. కొన్ని డిష్‌లకు తాత్కాలికంగా మంగళం పాడేశారు. ఇక పలు టీ దుకాణాలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. పలు హోటళ్లు కట్టెలు, పొట్టుతో కూడిన పొయ్యిలపై దృష్టి పెట్టాయి. దీంతో కట్టెలు, పొట్టుకు సైతం డిమాండ్ పెరిగింది. -
నో గ్యాస్.. నో బుకింగ్స్ రాజమండ్రిలో ప్రజల ఆవేదన
-
‘గ్యాస్ బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకోండి’
హైదరబాద్: గ్యాస్ కొరత కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 90 శాతం హోటళ్లు మూతపడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. గ్యాస్ కొరత కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా గ్యాస్ బ్లాక్ మార్కెట్ కారణంగానే ఈ పరిస్థితి వచ్చినట్లు కనబడుతోందని, ఈ బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కేటీఆర్. ఈ మేరకు సిలిండర్ల తీవ్ర కొరతను పరిష్కరించడానికి వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు. ఎల్పీజీ సిలిండర్ లభ్యతపై పారదర్శక సమాచారాన్ని అందించడానికి రియల్-టైమ్ పబ్లిక్ డాష్‌బోర్డ్‌ను రూపొందించాలని ఆయన సిఫార్సు చేశారు చిన్న వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారాన్ని నివారించడానికి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై తాత్కాలిక ధరను నిర్ణయించి దానిని అమలు చేయాలన్నారు. -
ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్‌ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.హోటల్ పరిశ్రమలోనూ ఆందోళనహాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.25 రోజుల వెయిటింగ్ పీరియడ్మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్‌ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
KSR: ఏపీ మహిళలకు బాబు బిగ్ షాక్.. ఒక సిలిండర్ మాత్రమే..!
-
నాయకా.. న్యాయమా?.. రూ.500 సిలిండర్ వర్తింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు గడుస్తోంది.. కానీ.. రూ.500కు వంటగ్యాస్ అమలు మాత్రం పేద కుటుంబాలకు అందని ద్రాక్షగా మారింది. ఆరు గ్యారంటీలలో భాగంగా సిలిండర్‌పై సబ్సిడీ అందిస్తున్నా.. మెజార్టీ బీపీఎల్ కుటుంబాలకు వర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. పేద కుటుంబాలు గృహాలక్ష్మి పథకానికి అర్హత సాధించినా.. మహాలక్ష్మి పథకం మాత్రం అందని దారక్షగా తయారైంది. లోక్‌సభ ఎన్నికల ముందు గ్యాస్ సబ్సిడీ వర్తింపు అమలు ప్రారంమైంది. ఆరు నెలల క్రితం నిర్వహించిన ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను గుర్తించారు. మిగతా పథకాల మాదిరి మహాలక్ష్మి పథకానికి కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కానీ పథకం వర్తింపు మాత్రం కొందరికే వర్తింపజేయడంతో నిరుపేదల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నిబంధనలపై పౌరసరఫరాల అధికారులతో పాటు ఆయిల్ కంపెనీలకు సైతం స్పష్టత కరువైంది.ఇది పరిస్థితి..గ్రేటర్ పరిధిలో గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు 30.18 లక్షలపైగా ఉండగా అందులో సుమారు 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారు 19.01 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. దరఖాస్తుదారుల్లో కేవలం 10 శాతం కుటుంబాలకు కూడా సబ్సిడీ వర్తించకపోవడం గమనార్హం.నగదు జమ రూ.40.71గృహోపయోగ వంట గ్యాస్ వినియోగదారులుకు బ్యాంక్ ఖాతాలో నగదు బదిలీ పథకం కింద సబ్సిడీ రూ. 40.71 మాత్రమే జమ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరతో నిమిత్తం లేకుండా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో పరిమితంగా నగదు జమ చేస్తోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ప్రకారం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855. పలుకుతోంది. గృహ వినియోగదారులందరూ సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖతాలో జమ చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత మూడు నెలలుగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా కొందరు లబ్ధిదారులకు మాత్రమే సిలిండర్ ధరలో రూ. 500 మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారుల ఖాతాలో వేస్తోంది. -
Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కొందరికే పరిమితమైంది. తెల్లరేషన్ కార్డు కలిగి విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించినా.. వంటగ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించని పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేదలకు ఎప్పటి మాదిరిగా వంటగ్యాస్ ధర భారంగా తయారైంది. మూడు నెలల క్రితమే మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం అమలు ప్రారంభమైంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో బిల్లు, వంటగ్యాస్ సబ్సిడీకి లబి్ధదారులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పథకాలకు కూడా తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. వాస్తవంగా మహా నగరంలో సుమారు 17.21 లక్షల కుటుంబాలు తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉండగా అందులో సుమారు 11 లక్షల కుటుంబాలకు మాత్రమే విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. రూ.500కు వంట గ్యాస్ మాత్రం అందులో కేవలం రెండు లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. గ్యారంటీ పథకాల కింద బీపీఎల్‌గా అర్హత సాధించినా సబ్సిడీ వర్తించకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.855కు సిలిండర్.. మహా నగరంలో బహిరంగ మార్కెట్ ప్రకారం‡ ప్రస్తుతం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.855 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖతాలో జమచేస్తూ వస్తోంది. తాజాగా ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబ్ధిదారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో రూ.500 మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ ద్వారా వినియోగదారులు ఖాతాలో చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందరికి వర్తిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మాత్రం కొందరికే పరిమితమైంది. కేంద్రం సబ్సిడీ రూ. 40.71 మాత్రమేకేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీని పరిమితం చేసింది. సిలిండర్ ధర ఎంత పలికినా.. సబ్సిడీ సొమ్ము మాత్రం రూ.40.71లు మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. పదేళ్ల క్రితం వరకు సబ్సిడీపై రూ.414కు మాత్రమే వంట గ్యాస్ ధర సరఫరా జరిగేది. మిగతా ధరను కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే భరించేది. ఆ తర్వాత వంట గ్యాస్‌కు నగదు బదిలీ పథకం వర్తింపుజేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సిలిండర్ సరఫరా చేసి ఆ తర్వాత సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చారు. 2015లో సిలిండర్‌ను మార్కెట్ ధర ప్రకారం రూ. 697కు కొనుగోలు చేస్తే సబ్సిడీగా రూ.239.65 నగదు బదిలీ ద్వారా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. బహిరంగ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా.. సబ్సిడీ మాత్రం ఒక స్లాబ్‌కు పరిమితమైంది.వంటగ్యాస్ కనెక్షన్లు ఇలా హైదరాబాద్ జిల్లా 13.22లక్షలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 15.96 లక్షలు -
నిత్యావసరాలనూ వదలట్లేదు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ‘పగటి పూట’ నిత్యావసరాల రవాణాపై సైతం ఆంక్షలు తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు పగటి పూట నిత్యావసరాలైన వంట గ్యాస్, ఇంధనం సరఫరా చేసే భారీ వాహనాలను సైతం అడ్డుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. గత నెలలో ట్రాన్స్‌పోర్టు సమ్మె కొంత ప్రభావం చూపగా, తాజాగా పగటి పూట సిటీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ అమలు చేస్తుండడంతో..ఇంధన ఉత్పత్తుల రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. రాత్రిపూట అనుమతి ఉన్నా..రవాణా మాత్రం అంతంతమాత్రంగా తయారైంది. ఏకంగా ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులను కలిసి లోడ్ వాహనాల అడ్డిగింపును దృష్టికి తీసుకొని వెళ్లినా..ఫలితం లేకుండా పోయింది. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్‌లో గ్యాస్, ఇంధనం నిల్వలు పుష్కలంగా ఉన్నా...రవాణా ఆంక్షలతో వచ్చిన సరుకు వచ్చినట్లే పంపిణీ జరుగుతుండటంతో గోదాములు వెలవెలబోతున్నాయి. రాత్రి పూట సరఫరాతో పెట్రోల్, డీజిల్ బంకుల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... వంట గ్యాస్ పంపిణీ మాత్రం చుక్కలు చూపిస్తోంది. రీఫిల్ డిమాండ్ లక్షన్నరపైనే.. మహానగరంలో దినసరి వంట గ్యాస్ డిమాండ్ సుమారు లక్షన్నర ఎల్పీజీ సిలిండర్లపైనే ఉంటుంది. తాజా పరిస్థితులతో పంపిణీ మాత్రం అంతంత మాత్రంగా తయారైంది. మూడు ప్రధాన చమురు సంస్థలకు చెందిన 125 ఏజెన్సీల పరిధిలో గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 30 లక్షలపైనే ఉన్నాయి. మరో వైపు వాణిజ్య అవసరాలకు సైతం లక్షల వరకు సిలిండర్ల డిమాండ్ ఉంటుంది. పగటి పూట రవాణాపై అంక్షలు వంటగ్యాస్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎల్పీజీ లోడ్ వాహనాలను అనుమతించాలి సిటీలో పగటి పూట కూడా ఎల్పీజీ లోడ్ వాహనాలను అనుమతించాలి. భారీ వాహనాలకు నో ఎంట్రీ పేరుతో ఎల్పీజీ సిలిండర్ల లోడ్లను అడ్డుకోవడం తగదు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. శివార్లలోని టెర్మినల్స్ నుంచి నగరంలోకి వస్తున్న సిలిండర్ల లోడ్ వాహనాలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుని నిలిపివేస్తున్నారు. రాత్రి పూట మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో వంట గ్యాస్ పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తక్షణమే ఎల్పీజీ వాహనాలను మినహాయించాలి. – అశోక్ కుమార్, అధ్యక్షుడు, వంట గ్యాస్ డీలర్ల సంఘం, హైదరాబాద్ -
గ్యాస్ ధరపై సామాన్యులకు గుడ్ న్యూస్
-
గోనుగొప్పల వాగులో చిక్కుకున్న సిలిండర్ల లారీ
-
గ్యాస్ సబ్సిడీ అంతంతే!
నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ప్రతి రెండు నెలలకు ఒకసారి ఎల్పీజీ సిలిండర్‌ను ఆన్లైన్లో బుకింగ్ చేస్తున్నాడు. మూడు నాలుగు రోజుల వ్యవధిలో సిలిండర్ డోర్ డెలివరి కూడా జరుగుతోంది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం అమలవుతుండడంతో మార్కెట్ ధర చెల్లిస్తూ వస్తున్నాడు. కానీ, సబ్సిడీ సొమ్ము మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదు. గత పది మాసాల కాలంలో ఐదు సిలిండర్లు తీసుకున్నా నయా పైసా ఖాతాలో పడలేదు. ఆలస్యంగా గుర్తించిన శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ దష్టికి తీసుకెళ్లాడు. ఆన్లైన్లో పరిశీలించి బ్యాంక్ లింకేజి కట్ అయిందని, తిరిగి పునరుద్ధరించుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ఇదీ ఒక శ్రీనివాస్ సమస్య కాదు.. నగరంలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య. సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ సబ్సిడీ సొమ్ము చుక్కలు చూపిస్తోంది. నగదు బదిలీ కింద సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాలో జమ సమస్యగా తయారైంది. వినియోగదారుడు మార్కెట్ ధర చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తున్నా.. సబ్సిడీ సొమ్ము నగదుగా వెనక్కి జమ అవుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. కొందరు వినియోగదారులకు నెలల తరబడి అసలు నగదు జమ అంటూ లేకుండా పోతోంది. ముఖ్యంగా గ్యాస్ సబ్సిడీ కోసం తెరిచిన బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ నగదు జమకు అనేక సమస్యలు ఆటంకంగా మారాయి. మరోవైపు ఎల్పీజీ సిలిండర్æ బుకింగ్ సమయాల్లో సైతం చిన్న చిన్న తప్పిదాలు బ్యాంక్ లింకేజి బంధంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా గ్యాస్ సబ్సిడీ నెలల తరబడి నిలిచిపోతోంది. గ్యాస్ సబ్సిడీ నగదు రూపంలో జమకు ఒక నిర్దిష్ట సమయం అంటూ లేక పోవడంతో వినియోగదారులు గుర్తించే సరికి నాలుగైదు సిలిండర్లు డోర్ డెలివరీ అవుతున్నాయి. ఆలస్యంగానైనా గుర్తించి డిస్ట్రిబ్యూటర్ దష్టికి తీసుకెళ్లితే సబ్సిడీ నగదు సొమ్ము జమ తమకు సంబంధం లేదంటూ చేతులేత్తుస్తూ ఒక ఉచిత సలహా పారేయడం సర్వసాధారణంగా తయారైంది. వాస్తవంగా పథకం అమలు ఆరంభంలో కొంత ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత సక్రమంగానే బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతూ వచ్చింది. కానీ, తిరిగి పాత పరిస్థితి ఇప్పుడు పునరావృతం అవుతోంది. వినియోగంలో లేకుంటే అంతే.... వంట గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధామైన బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకుంటే సబ్బిడీ సొమ్ము వెనక్కి వెళ్తోంది. కొందరు వినియోగదారులు వంట గ్యాస్ సబ్సిడీ కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటిని అనుసంధానం చేయించారు. కేవలం ఆ ఖాతాలు సబ్సిడీ సొమ్ముకు పరిమితం కావడంతో కనీస నగదు లేక కొన్నిసార్లు ఇన్‌యాక్టివ్ అవుతుంటాయి. దీంతో బయట నుంచి వచ్చిన సొమ్ము ఖాతాలో జమ కావడానికి సాంకేతిక సమస్యలు తయారవుతున్నాయి. దీంతో గ్యాస్ సబ్సిడీ కాస్త ఆయిల్ కంపెనీలకు వెళ్లిపోతుంది. ఒక సారి సబ్సిడీ వెనక్కి వస్తే ఆ తర్వాత సబ్సిడీ విడుదల నిలిచిపోతుంది. బ్యాంక్ లింకేజి బంధం కూడా తెగిపోతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయాల్లో సైతం పొరపాటున గ్యాస్ సబ్సిడీ వదులుకునే ఆప్షన్‌కు నెంబర్ ప్రెస్ అయితే సబ్సిడీ కాస్త నిలిచిపోయి బ్యాంక్ లింకేజి బంధం తెగుతోంది. దీంతో సబ్సిడీ సొమ్ము అందడం లేదు. బ్యాంక్ లింకేజీనిపునరుద్ధరించుకోవాలి వంట గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా వినియోగంలో లేకుంటే సబ్సిడీ నగదు జమ కాదు. బుకింగ్ సమయంలో గ్యాస్ సబ్సిడీ వదలుకునే ఆప్షన్ పొరపాటున నొక్కినా సబ్సిడీ నిలిచిపోతుంది. బ్యాంక్ లింకేజి కట్ అవుతోంది. సబ్సిడీ సొమ్ము కావాలంటే బ్యాంక్ ఖాతాలను వినియోగంలోకి తీసుకొని రావాలి. తిరిగి బ్యాంక్ ఖాతాలను గ్యాస్ కనెక్షన్‌తో అనుసంధానం చేసుకొవాలి. బ్యాంక్ లింకేజీలను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.– అశోక్‌కుమార్, అధ్యక్షుడు, వంటగ్యాస్ డీలర్ల సంక్షేమ సంఘం, హైదరాబాద్ -
గ్యాస్ సిలిండర్లలో గంజాయి
బనశంకరి : గ్యాస్ సిలిండర్‌లో అక్రమంగా గంజాయి నింపి సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ వ్యక్తిని బెంగళూరు నగరంలోని రామమూర్తినగర పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ వివరాలను వెల్లడించారు. రామమూర్తినగర విజినాపుర గులాబ్జాన్ అలియాస్ గులాబి అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ల కింది భాగాన్ని వృత్తాకారంలో కత్తిరించి దానికి తాళం వేసే రీతిలో మార్పులు చేశాడు. అందులో చిన్నచిన్న గంజాయి ప్యాకెట్లు నింపి బైకుపై వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ విక్రయిస్తున్నాడు. విజినాపుర ప్లాట్ఫారం రోడ్డులో ఆటోలో గంజాయి నింపిన గ్యాస్ సిలిండరును రవాణా చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా మంగళవారం రామమూర్తినగర పోలీసులు ఆ ప్రాంతంలో కాపుకాసి ఆటోపై దాడి చేసి గులాబ్జాన్ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి గంజాయి, ఓ ఆటో, సెల్‌ఫోన్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే గంజాయి సరఫరా చేస్తున్న మరో వ్యక్తి సమాచారం కూడా తెలిసిందని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తుమని కమిషనర్ తెలిపారు. అంతేగాక గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసి వాటికి తాళం వేసే రీతిలో తయారు చేసిన వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నామన్నారు. -
సిలిండర్ @ రూ.2వేలు !
గొడౌన్లో గ్యాస్ లేదా...? గ్యాస్ అందుబాటులోకి రావడం లేదా....? అయితే సీలేరు రండి. రూ.2 వేలు ఇస్తే నడుచుకొని మీ ఇంటికి గ్యాస్ వచ్చేస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర 2000 రూపాయలా..? అని ఆశ్చర్యపోతున్నారా!! ఔను నిజం. గ్యాస్ కావాలంటే అంత చెల్లించక తప్పదు. ఎందుకంటే ఇక్కడంతా దళారుల ఇష్టారాజ్యం. - సీలేరులో అంతే... - దళారుల చేతిలో సబ్సిడీ గ్యాస్ - ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు - అధిక ధరలకు ఒడిషా తరలింపు - పట్టించుకోని అధికారులు సీలేరు: సీలేరులో ప్రభుత్వ సబ్సిడీ గ్యాస్ దళారుల పాలవుతోంది. గ్యాస్ అధికారులు స్థానికంగా ఉన్న కొందరు దళారులు ఒక్కటై నకిలీ పేర్లతో పాస్ పుస్తకాలను తయారు చేసి ఒక్కొక్కరు 20 నుంచి 30 వరకు కనెక్షన్లు ఇళ్లల్లో పెట్టుకొంటున్నారు. ఈ వ్యవహారం అంతా రెండేళ్లుగా సాగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సీలేరుకు గ్యాస్ వచ్చిందంటే దళారుల సందడి ఎక్కువవుతుంది. ఒక్కో ఇంటిలో ఒకే పేరుపై నాలుగైదు కనెక్షన్లు, దానికి తోడు దళారుల వద్ద అధికంగా కనెక్షన్లు ఉండడంతో నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలే చింతపల్లి గ్యాస్ గొడౌన్లో అవినీతి వెలు గు చూడడానికి ప్రధాన కారణం సీలేరే. మరణించిన, ఊరు విడిచి వెళ్ళిన వారు, బదిలీ అయిన ఉద్యోగుల పేరిట కనెక్షన్లు ముందుగా తీసుకొని దళారులు దళారులు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి నెలకు రెండుసార్లు గ్యాస్ సరఫరాచేయాల్సి ఉంది. అయితే ఇక్కడ దళారులు చింతపల్లి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై గ్యాస్ సరఫరాలో జాప్యం చేస్తారు. ఈలోగా వినియోగదారుల అవసరాన్ని సాకుగా తీసుకుని తమ వద్ద ఉన్న సిలిండర్లను అధిక ధరలకు అమ్మి దళారులు సొమ్ము చేసుకుంటారు. సబ్సిడీ రేటు రూ.420గా ఉండగా, దళారులు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. కనెక్షన్ ఉన్నా...నో గ్యాస్ ఆదివారం సీలేరులోని వినియోగదారుల కోసం 320 గ్యాస్ సిలిండర్లు సరఫరా అయ్యాయి. అయితే సరఫరా అయిన గ్యాస్ దళారుల పాలబడింది. లబ్దిదారుల్లో సగం మందికి కూడా గ్యాస్ అందకపోవడం గమనార్హం. అంటే ఒక్కొక్కరి వద్ద దగ్గర పదికి మించి బండలు ఉండడంతో వారంతా గ్యాస్‌ను సబ్సిడీ రేటుకు దక్కించుకున్నారు. వచ్చిన గ్యాస్‌లో సగం వారే తన్నుకుపోవడంతో మిగిలిన లబ్దిదారులకు గ్యాస్ అందక బిక్కమొగం వేశారు. రెండు నెలలుగా ఎదురు చూసినా తీరా గ్యాస్ వచ్చినా తమకు అందక గంటల తరబడి వేచి ఉండి ఖాళీ బండలతో లబ్దిదారులు ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు. అధిక ధరలకు ఒడిషా తరలింపు అధిక ధరల కారణంగా స్థానికంగా డిమాండ్ లేకపోతే తమ వద్ద గల సిలిండర్లను దళారులు యథేచ్ఛగా పొరుగునే ఉన్న ఒడిషాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిత్రకొండ, బలిమెల, మల్కన్‌గిరి వరకు బహిరంగంగా వ్యాన్లలో గ్యాస్ సిలిండర్లను తరలించడం ఇక్కడ నిత్యకృత్యం. ఇలా యథేచ్ఛగా సబ్సిడీ గ్యాస్ పక్కదారి పడుతుంటే పౌర సరఫరా అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు గ్యాస్ అక్రమాలను దృష్టిలో పెట్టుకొని చింతపల్లిలో, సీలేరు దళారుల చేతిలో ఉన్న నకిలీ కనెక్షన్లు గుర్తించి నిజమైన లబ్దిదారులకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


