గ్యాస్‌ సరఫరాలో ఎగుమతి యూనిట్లకు ప్రాధాన్యం | FIEO Urges Priority Gas Allocation for Export Units to Safeguard India Trade | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సరఫరాలో ఎగుమతి యూనిట్లకు ప్రాధాన్యం

Mar 17 2026 8:50 AM | Updated on Mar 17 2026 5:06 PM

FIEO Urges Priority Gas Allocation for Export Units to Safeguard India Trade

ఎగుమతి ఆధారిత తయారీ యూనిట్లకు ప్రాధాన్య ప్రాతిపదికన ఎల్‌పీజీ, సహజ వాయువును కేటాయించాలని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇంధన కొరత ఏర్పడితే భారతీయ సంస్థలు సకాలంలో ఎగుమతుల లక్ష్యాలను పూర్తి చేయలేవని.. దీంతో అంతర్జాతీయ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ దేశాల వైపు మళ్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చైనా ప్రయోజనం పొందొచ్చని పేర్కొంది. కనుక ఎగుమతి ఆధారిత తయారీ పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరా కొనసాగేలా చూడడం ఎంతో అవసరమని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హాన్‌ తెలిపారు.

ఈ విషయమై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలకు లేఖ రాసినట్టు చెప్పారు. ఎగుమతులపై ఆధారపడిన చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) సైతం గ్యాస్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం చూపించాలని కోరారు. ఎగుమతిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత.. పశి్చమాసియాలో సంక్షోభ వాతావరణం నెలకొనడం తెలిసిందే. దీంతో చమురు, గ్యాస్‌ ధరలు గణనీయంగా పెరిగాయి.

గ్యాస్‌ కొరత ఏర్పడడంతో వంటగ్యాస్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. పరిశ్రమలకు ఇప్పటికే 50 శాతానిక పైనే గ్యాస్‌ కోత విధించడం గమనార్హం. జలంధర్‌ కేంద్రంగా పనిచేసే హ్యాండ్‌ ఉపకరణాల తయారీదారులు, ఎగుమతిదారుల సమాఖ్య ప్రెసిడెంట్‌ అశ్వినీ కుమార్‌ సైతం ఇదే మాదిరి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తి కోసం రోజువారీ 425 కిలోల ఎల్‌పీజీ, కార్మికుల ఆహార తయారీకి వీలుగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా ఎంతో అవసరమని చెప్పారు.

ఇదీ చదవండి: దేశంలోనే టాప్‌ 10 రుణ ఎగవేతదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement