గ్యాస్‌ సిలిండర్లలో గంజాయి | ganja supply in cylinders | Sakshi
Sakshi News home page

Dec 12 2017 5:18 PM | Updated on Aug 20 2018 4:30 PM

బనశంకరి : గ్యాస్‌ సిలిండర్‌లో అక్రమంగా గంజాయి నింపి సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ వ్యక్తిని బెంగళూరు నగరంలోని రామమూర్తినగర పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ వివరాలను వెల్లడించారు. రామమూర్తినగర విజినాపుర గులాబ్‌జాన్‌ అలియాస్‌ గులాబి అనే వ్యక్తి గ్యాస్‌ సిలిండర్ల కింది భాగాన్ని వృత్తాకారంలో కత్తిరించి దానికి తాళం వేసే రీతిలో మార్పులు చేశాడు. అందులో చిన్నచిన్న గంజాయి ప్యాకెట్లు నింపి బైకుపై వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ విక్రయిస్తున్నాడు. విజినాపుర ప్లాట్‌ఫారం రోడ్డులో ఆటోలో గంజాయి నింపిన గ్యాస్‌ సిలిండరును రవాణా చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా మంగళవారం రామమూర్తినగర పోలీసులు ఆ ప్రాంతంలో కాపుకాసి ఆటోపై దాడి చేసి గులాబ్‌జాన్‌ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి గంజాయి, ఓ ఆటో, సెల్‌ఫోన్‌ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే గంజాయి సరఫరా చేస్తున్న మరో వ్యక్తి సమాచారం కూడా  తెలిసిందని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తుమని కమిషనర్‌ తెలిపారు. అంతేగాక గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసి వాటికి తాళం వేసే రీతిలో తయారు చేసిన వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నామన్నారు.                                                                           

  

Advertisement
 
Advertisement
Advertisement