సిలిండర్‌ అందుబాటు గ్యాసే! | Residents in Hyderabad are facing increasing LPG supply problems. | Sakshi
Sakshi News home page

సిలిండర్‌ అందుబాటు గ్యాసే!

Mar 22 2026 1:18 AM | Updated on Mar 22 2026 1:18 AM

సాక్షి,  హైదరాబాద్‌: నగరంలో గ్యాస్‌ ఇక్కట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. షేక్‌పేట్‌లోని మాధవి గ్యాస్‌ ఏజెన్సీ వద్ద శనివారం వినియోగదారులు గంటలతరబడి వేచి చూడడం కన్పించింది. 

సిలిండర్‌ కోసం 8 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానని, గత రెండు రోజులుగా ఏకంగా ఏజెన్సీ వద్దకు వచ్చి లైన్‌లో నిలబడినా లభించలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరికొందరూ ఈ విధంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు దీనిపై స్పందించడం లేదని, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత లేదని కొందరు వినియోగదారులు మండిపడ్డారు. ఎవరికి సిలిండర్లు అందిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement