Shamirpet: ఖాళీ సిలిండర్‌... క్యూలోమీటర్‌ | cooking gas shortage long queues medchal shamirpet | Sakshi
Sakshi News home page

Shamirpet: ఖాళీ సిలిండర్‌... క్యూలోమీటర్‌

Mar 27 2026 8:04 AM | Updated on Mar 27 2026 12:16 PM

cooking gas shortage long queues medchal shamirpet

మేడ్చల్‌ రూరల్‌/గోల్కొండ: వంటగ్యాస్‌కు తంటాలు తప్పడంలేదు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌లోని ఓ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద గురువారం వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో కిలోమీటర్‌ మేర క్యూ కట్టారు. సుమారు 500 మందికి పైగా రాజీవ్‌ రహదారి వరకూ బారులు తీరారు. బుకింగ్‌ చేసి 20 రోజులవుతున్నా సరఫరా చేయడంలేదని ఆరోపించారు. జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి గ్యాస్‌ ఏజన్సీ కార్యాలయానికి వచ్చి పరిస్థతిని పరిశీలించారు. 

కొరత లేదని బుకింగ్‌ చేసుకున్న ప్రతి ఒక్కరికీ సిలిండర్‌ అందజేస్తామని తెలిపారు.  సిలిండర్ల కోసం షేక్‌పేట్‌లోని గోదాముల వద్ద ప్రజలు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం షేక్‌పేట్‌ నాలా మాధవి గ్యాస్‌ ఏజెన్సీ వద్ద ఒకరినొకరు తోసుకుంటూ సిలిండర్లు తీసుకెళ్లేందుకు సిద్ధపడగా నియంత్రించి సర్దిచెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement