breaking news
Horrifying footage
-
పెళ్లి వేడుకలో అపశృతి : ఒక్కసారిగా కూలిన పైకప్పు
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలోని ఒక గ్రామంలో వివాహ వేడుకలో జరిగిన అనూహ్య ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. అంతా పెళ్లి సంబరాల్లో ఉండగా ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. దాదాపు 20 మంది గాయపడ్డారు కానీ అదృష్టవశాత్తూ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.వివాహానికి సంబంధించి, హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో జరుపుకునే సాంప్రదాయ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక జాతర కార్యక్రమం జరుగుతోంది. ఇంటిపైకప్పున చేరి, కింద మరికొందరు ఈ వేడుకను చూస్తున్నారు. అతిథుల జానపద నృత్యాలు, పాటలతో అక్కడి వాతావరణ అంతా సందడి సందడిగా ఉంది. ఇంతలో పక్కనే ఉన్న ఇంటి పైకప్పు ఒకటి అక్కడ గుమిగూడిన వారిపై ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా తీవ్ర కూలిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్Accident caught in 4K.Just 2-3 ays ago during a marriage function in Chamba, the roof of a house suddenly collapsed where people were sitting. Around 20 people were injured but thankfully no major casualty. Now the drone footage of this incident has emerged . pic.twitter.com/U6CIOa4Os0— Nikhil saini (@iNikhilsaini) December 8, 2025 మరికొందరు వారిని రక్షించడానికి ముందుకు వచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. బాధితులను వెంటనే చికిత్స కోసం టీసా ఆసుపత్రికి తరలించారు. మరికొందరు తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. ఈ ఘటన ఎలా జరిగింది అనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు -
తెల్లతోలు పిల్లకు చుక్కలు చూపించింది
ఓక్లామా: ఓక్లామాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తన జాతిని కించపరిచేలా మాట్లాడినందుకు ఓ నల్లజాతి యువతి, తెల్లజాతి యువతికి చుక్కలు చూపించింది. బతికుంటే చాలురా బాబు అనుకునేంత భయంకరంగా ఆ తెల్లతోలు అమ్మాయిపై శివంగిలా దాడి చేసింది. ఓ వీడియోలో రికార్డయిన ఈ దృశ్యాల ప్రకారం.. ఓక్లామాలో అలెయా అనే ఓ నల్లజాతి యువతి జాగింగ్‌కు వస్తున్న సమయంలో ఆమెకు ఓ తెల్లజాతి అమ్మాయి తారసపడింది. అప్పుడు నువ్వు ఎందులోనైనా పోటీ చేస్తున్నావా అని ప్రశ్నించగా అలాంటిదేం లేదనడంతోపాటు దానికి అలెయా జాతిని కించపరిచేలా ఒక పదాన్ని చేర్చింది. దీంతో అలా ఎందుకు అన్నావు? అలా అనడానికి నువ్వు ఎవరూ అని మెల్లగా వాగ్వాదానికి దిగింది. దానికి బదులిచ్చిన ఆ యువతి నువ్వు నా నేలపై ఉంటున్నావని మర్చిపోకు అంటూ మరోసారి అంతకుముందు అన్న అసభ్యకరమైన మాటను జారవిడిచింది. దీంతో అలెయా ఒక్కసారిగా శివంగిలా మారి ఒక్క పంచ్‌తో ఆ యువతిని కింద పడేసింది. అంతటితో ఆగకుండా వరుస పంచ్ లు ఇచ్చింది. పక్కనే ఉన్నవారు వచ్చి ఆపడంతో అలెయా శాంతించింది.


