మహాత్మునికి, శాస్త్రిజీకి ప్రధాని మోదీ నివాళులు | PM Modi Pays Tribute To Mahatma Gandhi And Lal Bahadur Shastri, Watch Video Inside | Sakshi
Sakshi News home page

మహాత్మునికి, శాస్త్రిజీకి ప్రధాని మోదీ నివాళులు

Oct 2 2025 10:45 AM | Updated on Oct 2 2025 10:57 AM

PM Modi pays tribute to Mahatma Gandhi and Lal Bahadur Shastri

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని  మార్చాయని ప్రధాని పేర్కొన్నారు.
 

సోషల్ మీడియా ‘ఎక్స్‌’ పోస్టులో ఆయన.. ధైర్యం,  సరళత అనేవి మనిషి మార్పునకు సాధనాలుగా ఎలా మారుతాయనేది గాంధీ చూపారని పేర్కొన్నారు. ప్రజలకు సాధికారత కల్పించడానికి సేవ, కరుణ ముఖ్యమైన సాధనాలని అ‍న్నారు. వీక్షిత భారత్‌ను నిర్మించాలనే మా ఆశయంలో మేము ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్‌లో ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమగ్రత, వినయం, దృఢ సంకల్పాల బలంతో భారతదేశాన్ని బలోపేతం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడిగా ఆయనను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆయన ఆదర్శప్రాయమైన నాయకత్వం, మహోన్నత వ్యక్తిత్వం, ఆయన ఇచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం ప్రజల్లో దేశభక్తిని రగిలించాయన్నారు. స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆయన మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement