
బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శనివారం (అక్టోబర్ 11) 83వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, టీవీ షోలు ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్‌పతి షో ద్వారా మరింత ప్రజాదరణ సంపాదించుకున్న సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. ఎన్నో విలక్షణమైన పాత్రలు గంభీరమైన స్వరం, అనన్య సామాన్యమైన నటన, అంతకుమించిన వ్యక్తిత్వం ఆయనను లెజెండ్రీగా నిలబెట్టాయి. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం ముందు ఫ్యాన్స్‌చేసిన సందడి అంతా ఇంతా కాదు.
అమితాబ్ బచ్చన్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. మ ముంబై లోని బిగ్ బీ బంగ్లా 'జల్సా' వెలుపల గుమిగూడారు. అంతేకాదు ఆయన పోషించిన ప్రముఖ పాత్రల వేషధారణలో, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు బిగ్ బీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ కురిసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్‌డే విషెస్ అందించారు.
#WATCH | Mumbai, Maharashtra | Fans of the Veteran Actor Amitabh Bachchan gather outside his bungalow, 'Jalsa', to catch a glimpse of their favourite movie star on the occassion of his birthday. His fans dressed up as famous characters played by the actor, and sang songs and… pic.twitter.com/MfE34Y5RWl
— ANI (@ANI) October 10, 2025
బిగ్ బీతో కలిసి నటించిన హీరో ప్రభాస్, కాజోల్, అజయ్ దేవ్‌గన్, శత్రుఘ్న సిన్హా,సునీల్ శెట్టి అ లాంటి సినీప్రముఖులతో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అమితాబ్‌కు విషెస్ చెప్పడం విశేషం. "లెజెండరీ అమితాబ్ బచ్చన్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు ఎపుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మా అందరికీ స్ఫూర్తిని ప్రసాదించాలన్నారు. అలాగే 1984లో తామిద్దరం ఎంపీలు అనే విషయానఇన గుర్తు చేసుకున్నారు.