40 ఏళ్లు దాటినా సరే హీరోయిన్ నయనతార.. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో చిరంజీవి 'మన శివశంకరవరప్రసాద్', బాలకృష్ణ కొత్త సినిమా, యష్ 'టాక్సిక్'తో పాటు తమిళ, మలయాళ చిత్రాలు చెరో రెండు ఉన్నాయి. అసలు విషయానికొస్తే ఈసారి నయన్ తన పుట్టినరోజుని సింపుల్‌గా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. భర్త విఘ్నేశ్ నుంచి గిఫ్ట్ మాత్రం చాలా ఖరీదైనది వచ్చింది.
గతంలో పలు రిలేషన్‌షిప్స్‌లో ఉన్న నయన్.. తర్వాత కాలంలో తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ని ప్రేమించింది. 2022లో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏడాది నుంచి ప్రతిసారి నయన్ పుట్టినరోజుకి విఘ్నేశ్ ఖరీదైన కార్లని బహుమతిగా ఇస్తూనే ఉన్నాడు.
2023లో రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెజ్ మేబాచ్, 2024 అంటే గతేడాది రూ.5 కోట్లు విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 కారుని విఘ్నేశ్ బహుమతిగా నయనతారకు ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్ల ఖరీదైన రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్ర్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఆ ఫొటోలని విఘ్నేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.



