నలుగురు ప్రాణాలు తీసిన బర్త్‌డే పార్టీ | Four people died in an accident in Udaipur | Sakshi
Sakshi News home page

నలుగురు ప్రాణాలు తీసిన బర్త్‌డే పార్టీ

Jan 20 2026 9:33 PM | Updated on Jan 20 2026 9:45 PM

Four people died in an accident in Udaipur

ఊదయ్‌పూర్ అతివేగంగా కారు నడిపి నిర్లక్షంగా వ్యవహరించినందుకు యువకులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ఆయువకుడు 140 కిలోమీటర్ల వేగంతో సిగరెట్‌ చేతిలో పట్టుకొని కారు నడిపాడు. దీంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనవివరాలు వీడియోలో రికార్డయ్యాయి.

డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్షంగా వ్యవహరించకూడదని ఎన్నిసార్లు చెప్పినా యువత పెడచెవిన పెడుతున్నారు. వాహనాన్ని నడిపేటప్పుడు మనం చేసే తప్పిందం ఖరీదు నిండుప్రాణాలే అన్న సంగతి యువత మర్చిపోతున్నారు. అహ్మదాబాద్‌లో తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి స్నేహితులు కలిశారు. అనంతరం టీకోసం మిత్రులంతా కారులో బయిలుదేరారు. ఆసమయంలో కారు నడుపుతున్న వ్యక్తి చేతిలో సిగరెట్ పట్టుకొని 140 కిలోమీటర్ల వేగంతో కారు నడిపారు.

ఆసమయంలో ఎదురుగా కారు రావడంతో వాహనాన్ని కంట్రోల్‌ చేయలేక ఢీకొట్టారు. ఈప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన అనంతరం కారులోని వ్యక్తులు సహయం కోసం అర్తనాథాలు చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్రమాద ఘటన జరిగిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement