డంకీ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తోన్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తన నెక్ట్స్ మూవీని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో చేస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఇవాళ షారూక్ బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
షారూక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. అందరూ ఊహించినట్లుగానే కింగ్(King Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఫుల్ యాక్షన్ మూవీ గ్లింప్స్ షారూక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. షారూక్ ఖాన్- సిద్ధార్థ్ కాంబోలో వచ్చిన పఠాన్ సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Sau deshon mein badnaam,
Duniya ne diya sirf ek hi naam - #KING#KingTitleReveal
It’s Showtime!
In Cinemas 2026. pic.twitter.com/l3FLrUH1S0— Shah Rukh Khan (@iamsrk) November 2, 2025


