
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ తనతో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం స్నేహ రెడ్డికి విషెస్ చెబుతున్నారు.
ఇక సినిమాల బన్నీ సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లనున్నారు.
Happy Birthday Cutie 🖤#AlluSnehaReddy pic.twitter.com/yNlsg72J0x
— Allu Arjun (@alluarjun) September 29, 2025