బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టికి ఆమె భర్త, టీమిండియా క్రికెటర్ ప్రత్యేక విషెస్ తెలిపారు. ఇవాళ అతియా శెట్టి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కాగా.. ఇవాళ అతియా తన 33వ పుట్టినరోజు జరుపుకుంటోంది.
కేఎల్ రాహుల్ తన పోస్ట్‌లో రాస్తూ.. "నా ప్రాణ స్నేహితురాలు, సతీమణి, ప్రేమికురాలు, స్ట్రెస్ బాల్, గూఫ్‌బాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. గడిచిన ప్రతి సంవత్సరం నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా' అంటూ సతీమణిపై ప్రేమ కురిపించారు. దీనికి లవ్ యూ అంటూ అతియా శెట్టి రిప్లై కూడా ఇచ్చింది. కూతురు బర్త్ డే సందర్భంగా సునీల్ శెట్టి బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్ట్ చేశారు. అతియాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అతియా బ్రదర్ అహన్ శెట్టి కూడా సిస్టర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రాణ స్నేహితుడిగా ఉన్న వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశాడు.
కాగా.. అతియా శెట్టి కొంతకాలంగా సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటోంది. 2023 జనవరి 23న క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను పెళ్లాడింది. ముంబయి సమీపంలోని ఖండాలా ఉన్న సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో వీరిద్దరి వివాహం జరిగింది. ఆ తర్వాత ఈ జంటకు ఈ ఏడాది మార్చిలో తమ మొదటి బిడ్డకు ఎవారా అనే కుమార్తెకు స్వాగతం పలికారు. మరోవైపు అతియా 2015లో హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ వంటి చిత్రాలలో నటించింది.


