
ప్రముఖ ఆర్జే మహ్‌వశ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవల లండన్ వెకేషన్లో ఉన్న చిత్రాలను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించింది. అయితే ఈ ముద్దుగుమ్మ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో డేటింగ్లో ఉందంటూ గతంలోనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
లండన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాహల్తో డేటింగ్పై చర్చ మొదలైంది. అదే లోకేషన్లో చాహల్ కూడా ఫోటోలు పోస్ట్ చేయడం ఈ జంట డేటింగ్ నిజమేనని అందరూ ఫిక్సయిపోయారు. తరచుగా వీరిద్దరు పార్టీల్లో కనిపించడం ప్రేమలో మునిగి తేలుతున్నారని అర్థమవుతోంది. చాహల్ విడాకుల తర్వాత మహ్‌వశ్ మరింత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఐపీఎల్లోనూ పంజాబ్ మ్యాచ్ల్లో సందడి చేసింది.
తాజాగా చాహల్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో విషెస్ తెలిపింది. జూలై 23న చాహల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. లండన్లోని ఓ రెస్టారెంట్లో చాహల్ కూర్చున్న ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.
మహ్‌వశ్ తన క్యాప్షన్లో.. "పుట్టినరోజు శుభాకాంక్షలు యుజీ! వయసు పెరగడం అనేది మన జీవితంలో ఒక భాగం. అలాగే జీవితంలో మిగిలిన భాగాలు మరింత దారుణంగా ఉంటాయి. అందుకే ఆల్ ది బెస్ట్" అంటూ ఫన్నీ ఎమోజీతో పోస్ట్ చేసింది. ఇప్పటికే వీరిద్దరి డేటింగ్లో ఉన్నారని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. ఈ పోస్ట్తో మరింత క్లారిటీ వచ్చేసింది. ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరైన చాహల్ డేటింగ్పై ఇన్డైరెక్ట్గా హింట్ ఇచ్చేశాడు. అయితే జీవితంలో మిగతావన్నీ కూడా దారుణంగా ఉంటాయని రాయడం చర్చనీయాంశంగా మారింది. చాహల్- ధనశ్రీ వర్మ విడాకులను ఉద్దేశించి చేసినట్లు అర్థమవుతోంది. కాగా.. చాహల్ ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్నారు.
