చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌.. 19 ఏళ్ల తర్వాత అవార్డ్‌ సినిమా రీరిలీజ్‌ | Chiranjeevi Stalin Movie Re Release Movie Details | Sakshi
Sakshi News home page

చిరు బర్త్‌డే స్పెషల్‌.. 19 ఏళ్ల తర్వాత హిట్‌ సినిమా రీరిలీజ్‌

Jun 28 2025 9:21 PM | Updated on Jun 28 2025 9:21 PM

Chiranjeevi Stalin Movie Re Release Movie Details

చిరంజీవి- త్రిష కలిసి నటించిన ‘స్టాలిన్‌’ సినిమా రీరిలీజ్‌ కానుంది. 2006లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఎ. ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఖుష్బూ, ప్రకాష్‌ రాజ్‌, మురళీ శర్మ, ప్రదీప్‌ రావత్‌ వంటి స్టార్స్‌ నటించారు. ఉత్తమ సందేశాత్మక చిత్రంగా (స్పెషల్ జ్యూరీ అవార్డు) నంది పురస్కారం కూడా స్టాలిన్‌ అందుకుంది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్‌  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీని చిరు సోదరుడు నాగబాబు నిర్మించగా గీతా ఆర్ట్స్‌ పంపిణీ చేసింది. ప్రస్తుతం స్టాలిన్‌ ఏకంగా మూడు (ఆహా, అమెజాన్‌, జియోహాట్‌స్టార్‌) ఓటీటీలలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్‌ అనుష్క కూడా ఒక స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది.

ఆగష్టు 22న మెగాస్టార్‌ చిరు పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్‌ చిత్రాన్ని 4K వర్షన్‌లో విడుదల చేయబోతున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్‌, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ జనరల్‌ మేనేజర్‌ స్వామి నాయుడు ఒక పోస్టర్‌ను తాజాగా లాంచ్‌ చేశారు. ఈ సినిమా చాలామంది యూత్‌ను ఆలోచించేలా చేసిందని చెప్పవచ్చు.  సుమారు 19 ఏళ్ల తర్వాత  స్టాలిన్‌ రీరిలీజ్‌ కానున్నడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మళ్లీ త్రిష- చిరు కలిసి విశ్వంభరలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement