ఆరేళ్లపాటు డేటింగ్‌.. మాజీ ప్రియుడిని మరవలేకపోతున్న బ్యూటీ! | Malaika Arora wishes ex Boy Friend Arjun Kapoor on his birthday | Sakshi
Sakshi News home page

Malaika Arora: మాజీ ప్రియుడి బర్త్ డే.. స్పెషల్‌గా విష్ చేసిన బాలీవుడ్ భామ!

Jun 26 2025 4:12 PM | Updated on Jun 26 2025 4:49 PM

Malaika Arora wishes ex Boy Friend Arjun Kapoor on his birthday

బాలీవుడ్ భామ మలైకా అరోరా పేరు చెప్పగానే ఐటమ్ సాంగ్సే గుర్తొస్తాయి. ఆ తర్వాత ఆమె డేటింగ్ వ్యవహారం గుర్తొస్తుంది. ఎందుకంటే హీరో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ పెళ్లి చేసుకున్న ఈమె.. దాదాపు 19 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమాయణం నడిపించింది. అయితే వీరి ప్రేమబంధం ఎక్కువ రోజులు నిలవలేదు. దాదాపు ఆరేళ్ల డేటింగ్‌ అనంతరం బ్రేకప్ చెప్పేసుకుని అభిమానులకు షాకిచ్చారు. అయితే కొన్నినెలల క్రితం ఐపీఎల్ మ్యాచ్‌లో శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర పక్కన మలైకా కనిపించడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారా? అంటూ రూమర్స్ వినిపించాయి. అయితే దీనిపై ఎవరూ కూడా స్పందించలేదు.

తాజాగా తన మాజీ భాయ్‌ ఫ్రెండ్‌ అర్జున్ కపూర్ బర్త్ డే కావడంతో విషెస్ తెలిపింది ముద్దుగుమ్మ. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హ్యాపీ బర్త్‌డే, అర్జున్ కపూర్' మాజీ ప్రియుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోన్న మలైకా అరోరా మాజీ లవర్‌కు విషెస్‌ చెప్పడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే గతేడాది బ్రేకప్ చెప్పుకున్న ఈ జంట మాత్రం  సోషల్ మీడియాలో ఫ్రెండ్‌షిప్‌ కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా.. అర్జున్‌ కపూర్ ఇటీవలే తెరపైకి వచ్చిన 'మేరే హస్బెండ్ కి బివి' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం 'నో ఎంట్రీ 2' అనే మూవీలో నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement