
మన చిన్నప్పటి ఫోటోలు దొరకడం చాలా అరుదు. ఈ రోజుల్లో అయితే మన పిల్లల్ని మొబైల్ ఫోన్ బంధిస్తున్నాం కానీ.. 1990ల్లో మాత్రం సెల్‌ఫోన్ అందుబాటులో లేదు. బాల్యంలో దిగిన ఫోటోలను పెద్దయ్యాక చూసుకుంటే ఎంత బాగుంటుందో. ఆ ఆనందం వేరే లెవెల్. అలా మన చిన్నప్పటి ఫోటోలు ఎవరైనా పంపిస్తే చూసి తెగ మురిసిపోతాం కూడా. అలాగే మనకు ఇష్టమైన వాళ్ల బర్త్డే రోజు చిన్నప్పటి ఫోటోలు పంపితే కలిగే సంతోషమే వేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.
టాలీవుడ్ హీరో సుశాంత్ అనుమోలు.. తాజాగా తన సిస్టర్కు సంగీత అనుమోలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్ డే సిస్టర్ అంటూ ఆమెతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇందులో బాల్యంలో అమ్మా, నాన్నతో తన సిస్టర్ దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. చాలా అరుదైన చిన్నప్పటి ఫోటోలో సుశాంత్ సిస్టర్ క్యూట్ క్యూట్‌గా కనిపించింది. ఈ పిక్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ సుశాంత్ సిస్టర్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సుశాంత్ పోస్ట్‌కు సంగీత కూడా రిప్లై ఇచ్చింది.
ఇక హీరో సుశాంత్ విషయానికొస్తే..ఆయన హీరోగా పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 18 సుశాంత్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు . ఇందులో ఎక్సార్సిస్ట్ (భూత వైద్యుడు)గా సుశాంత్ కనిపించనున్నారు.