సామాన్యులైనా సెలబ్రిటీలు అయినా సరే మనుషులే. కాబట్టి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం లాంటివి చేస్తుంటారు. ఈసారి బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా.. అలాంటి ఓ పొరపాటు చేసి దొరికిపోయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేమైంది? ఏంటి విషయం?
ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరాకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే 'గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక పాటలో డ్యాన్స్ చేసి ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. చాన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మలైకా.. ఈ మధ్యనే మళ్లీ సాంగ్స్ చేస్తోంది. రీసెంట్‌గా థియేటర్లలో రిలీజైన 'థామా'లోనూ ఓ క్రేజీ సాంగ్ చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా 50వ పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు)
సినిమా సెలబ్రిటీ.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం, సెలబ్రిటీలు సందడి చేయడం సాధారణమే. అయితే మలైకా తన 50వ పుట్టినరోజు అని చెప్పింది. కానీ నెటిజన్లు మాత్రం ఆమె అబద్ధం చెబుతోందని అంటున్నారు. ఎందుకంటే గతంలో 2019లో 46వ బర్త్ డేని జరుపుకొంది. అంటే ఇప్పుడు 52వ ఏడాదిలోకి వస్తుంది. కానీ విచిత్రంగా కేక్‌పైన 50 అని నంబర్ కనిపించింది. వికిపీడియా లేని టైంలో ఇలాంటివి ఏమైనా చేశారంటే సరేలే అనుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనూ ఇలాంటి రెండేళ్ల వయసు తగ్గించుకోవడం ఏంటోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
మలైకా విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ని 1998లో పెళ్లి చేసుకుంది. కానీ 2017లో విడాకులు ఇచ్చేసింది. వీళ్లకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నారు. అర్భాజ్‌కి విడాకులు ఇచ్చేసిన తర్వాత మలైకా.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉంటోంది.
(ఇదీ చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్)


