
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇక డార్లింగ్ కొత్త సినిమాల అప్‌డేట్స్ సైతం అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చాయి. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హనురాఘవపూడితో చేస్తోన్న సినిమాకు సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందరూ ఉహించినట్లుగానే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్‌కు పలువురు టాలీవుడ్ సినీతారలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభాస్‌తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. తాజాగా హీరోయిన్ ఛార్మి సైతం డార్లింగ్‌కు పుట్టినరోజు విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో నటించిన పౌర్ణమి రీ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.
(ఇది చదవండి: ప్రభాస్, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్ ప్రకటన)
ఈ సినిమాలో ప్రతి సీన్ ఇప్పటికీ గుర్తుందని రాసుకొచ్చింది. పౌర్ణమి మూవీతో నాకున్న ఉత్తమ జ్ఞాపకాలలో ఒకటని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ సినిమాతో మొదలైన ప్రభుదేవా, త్రిషతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని వెల్లడించింది. మా అభిమాన రెబెల్‌స్టార్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి విష్ చేసింది. కాగా..2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఛార్మి, త్రిష హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.
After 20years,#Pournami a film which is very very close to all of us is re-releasing today on our darling #Prabhas’s birthday.
I still remember each and every moment so strong and so beautiful, one of my best memories i have with pournami and even after 20years,… pic.twitter.com/kbGKXmhlmI— Charmme Kaur (@Charmmeofficial) October 23, 2025