
టాలీవుడ్ కింగ్ అంటే ఠక్కున ఆయన పేరే గుర్తుకొస్తుంది. ఆయనకు 65 ఏళ్లు దాటినా ఇంకా యువకుడిలానే కనిపించే తెలుగు హీరోల్లో ఓకే ఒక్కడు. హీరోయిన్లకు మన్మధుడిలా గుర్తుండిపోయిన స్టార్ అతనే. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో నవ, యువ మన్మధుడు నాగార్జున అక్కినేని. ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
ఆగస్టు 29న నాగార్జున పుట్టనరోజు కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది. కింగ్ నాగ్ నటించిన చిత్రాల్లోని సన్నివేశాలను ఓకే వీడియోలో రూపొందించి రిలీజ్ చేసింది. ఈ వీడియో అక్కినేని ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నాగార్జున ఇటీవలే రజినీకాంత్ మూవీ కూలీలో కనిపించారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. లోకేశ్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతకుముందు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన కుబేర మూవీలో కీలక పాత్రలో నటించారు.
He broke the norms with his versatility, ruled hearts with his aura, and redefined style with his unmatched swag.
Wishing our timeless King @iamnagarjuna garu, a very Happy Birthday 👑✨
-https://t.co/YcYp7fvh5w#HBDKingNagarjuna ❤️🔥 pic.twitter.com/CmVkQmKDrl— Annapurna Studios (@AnnapurnaStdios) August 28, 2025