
బర్త్ డే వచ్చిందంటే చాలు.. సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలు, ఖరీదైన బహుమతులు సర్వ సాధారణం. తాజాగా అలాగే ఓ ప్రముఖ నటి తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ అహానా కృష్ణ తన బర్త్‌డేను స్పెషల్‌గా మార్చేసుకుంది. 30 ఏట అడుగుపెడుతున్న వేళ ఖరీదైన బహుమతిని తనకు తానే ఇచ్చుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించింది.
తన బర్త్ డే కానుకగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. దీని విలువ దాదాపు రూ.93 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల వయస్సు నుంచి 30లోకి అడుగుపెట్టినందుకు కొంచెం బాధగా ఉందని రాసుకొచ్చింది. నాకు ఫుల్ సపోర్ట్‌గా నిలిచిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపింది. ఎందుకంటే నాకు నచ్చినట్లుగా జీవించే హక్కు కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. నేను సాధించిన ప్రతిదానికీ మీరే కారణమంటూ పేరేంట్స్‌ను కొనియాడింది. నా కలలును నిజం చేసినందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటానని అహానా కృష్ట ఫోటోలను షేర్ చేసింది.
కాగా.. నటుడు కృష్ణ కుమార్ కుమార్తె అయినా అహాన కృష్ణ 2014లో సినిమాల్లో అడుగుపెట్టింది. జాన్ స్టీవ్ లోపెజ్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత లూకా, అడి వంటి చిత్రాల్లో నటించింది. ఆమె చివరిసారిగా ఈ ఏడాది నాన్సీ రాణిలో కనిపించింది. కల్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా: చాప్టర్ 1 - చంద్ర(కొత్త లోకా) చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది.