
టాలీవుడ్ ప్రముఖ జంటల్లో వరుణ్ సందేశ్- వితికా శేరు ఒకరు. 'పడ్డానండి ప్రేమలో మరి' అనే చిత్రంలో మొదలైన వీరిద్దరి జర్నీ పెళ్లి పీటలవరకు చేరుకుంది. ఈ సినిమాతోనే ప్రేమలో పడిన ఈ జంట కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 19, 2016న వీరిద్దరు ఏడడుగులు వేశారు. అయితే ఈ జంట పెళ్లి తర్వాత బిగ్‌బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు.
అయితే వరుణ్ సందేశ్‌కు ఆయన సతీమణి వితికా శేరు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఈనెల 21న వరుణ్ పుట్టిన రోజు కావడంతో జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ను ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. భర్త వరుణ్ బర్త్డే సందర్భంగా కొత్త ఇంటిని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సందేశ్ స్వయంగా వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భార్యతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
వరుణ్ తన ఇన్స్టాలో రాస్తూ..'నా పుట్టినరోజుకి నువ్వు ఇల్లు కొని ఇచ్చినప్పుడే నేను ధన్యుడిని అయిపోయా. ఈ వాస్తవమైన ఊహించలేని ఆశ్చర్యాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా. ఇది కేవలం బహుమతి కాదు.. ఇది పూర్తిగా కొత్త అధ్యాయానికి నాంది. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా. నన్ను నిరంతరం ఆశ్చర్య పరుస్తూ.. నాకు మద్దతుగా నిలుస్తూ.. ఇప్పుడు నా ఇంటి యజమానిగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా సూపర్ ఉమెన్‌ను హద్దుల్లేని ప్రేమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కాగా.. హ్యాపీ డేస్ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్.. కొత్త బంగారులోకం, ఎవరైనా ఎప్పుడైనా, ప్రియుడు లాంటి చిత్రాల్లో కనిపించారు.