ప్రియాంక బర్త్‌డే.. కాలి చెప్పుపై కేక్‌.. 'తిండితో ఆటలా?' | TV Actress Priyanka Jain Turns 27 Years, Share Birthday Photos | Sakshi
Sakshi News home page

ప్రియాంక 27వ బర్త్‌డే.. కాలి చెప్పుపై కేక్‌.. ఫోటోలు వైరల్‌

Jul 2 2025 1:10 PM | Updated on Jul 2 2025 3:51 PM

TV Actress Priyanka Jain Turns 27 Years, Share Birthday Photos

ఏ డైలాగ్స్‌ చెప్పకుండా, కేవలం హావభావాలతోనే ఎమోషన్స్‌ పలికించడం చాలా కష్టం. అయినా సరే అదెంత పని అన్నట్లుగా కళ్లతోనే నటించేసింది ప్రియాంక జైన్‌ (Priyanka M Jain). మౌనరాగం సీరియల్‌తో బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాదు, ఈ సీరియల్‌ హీరో శివకుమార్‌తో ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమాయణం నడిపింది. 2018లో ఈ సీరియల్‌ రాగా.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతో అన్యోన్యంగా కలిసుంటున్నారీ లవ్‌ బర్డ్స్‌. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. 

బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌
జానకలి కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ప్రియాంక.. తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌తో అందరికీ సుపరిచితురాలైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టీవీ షోలలో కనిపిస్తోంది. తాజాగా పరి (శివకుమార్‌ ప్రియాంకను ముద్దుగా పిల్చుకునే పేరు) 27వ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

మీ అభిమానం వల్లే..
ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు మీరే కారణం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు చప్పట్లు కొట్టి తీరాల్సిందే! మీరు నన్ను ఎంతగానో నమ్మారు. నేను పోషించిన ప్రతి పాత్రకు, తీసుకున్న ప్రతి నిర్ణయాలకు మీ ఆశీర్వాదాలే కారణం. నా ప్రయాణంలో భాగమైనందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. అయితే ఓ ఫోటో తన కాలి చెప్పుపై బర్త్‌డే కేక్‌ను పెట్టింది. తర్వాత అదే కేక్‌ను ఆరగించింది. 

తిండితో ఆటలా?
ఇది చూసిన సెలబ్రిటీలు.. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం.. తినే ఆహారాన్ని అలా కాళ్లపై పెట్టి కించపరిస్తే తిండి దొరకదు, ఎంత వయసు వస్తే ఏంటి? సంస్కారం ఉండొద్దా? అన్నం కూడా అలాగే చెప్పులతో తింటావా? తిండితో ఆటలొద్దు, తినేదాన్ని కాలుమీద పెట్టినందుకు సిగ్గనిపించట్లేదా? అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు మాత్రం బ్యూటిఫుల్‌ పరికి హ్యాపీ బర్త్‌డే అని విషెస్‌ చెప్తున్నారు.

 

 

చదవండి: మమ్మల్ని చంపుకుతింటున్నారు.. ఇండస్ట్రీలో ఫ్లాపులే లేవా? దిల్‌ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement