
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అల్లు అర్జున్ తన ట్వీట్‌లో రాస్తూ..' మై డియరెస్ట్ డైరెక్టర్ అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీపై మా ప్రేమ ఎల్లప్పుడు ఉండాలి. ఈ ప్రత్యేక రోజున మీకు ఆనందం, ప్రేమ, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నా. మీరు దర్శకత్వంలో రానున్న సినిమాటిక్ మ్యాజిక్‌ను అందరూ ఆస్వాదించే వరకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. తొలిసారి అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ఏఏ22 పేరును ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు అట్లీ ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.
Happy Birthday to my dearest director @Atlee_dir garu. May abundance shower upon you. Wishing you all the joy, love, and prosperity. Can’t wait for everyone to experience the cinematic magic you’re creating 🖤 pic.twitter.com/Sb7S8Bfpmp
— Allu Arjun (@alluarjun) September 21, 2025