ఈ ఫోటోలోని చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్‌... ఎవరో గుర్తుపట్టారా? | Star Actress Shares Childhood Pics With Her Brother Birthday Occassion | Sakshi
Sakshi News home page

Star Actress: ఈ ఫోటోలోని చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్‌... ఎవరో గుర్తుపట్టారా?

Jun 23 2025 9:16 PM | Updated on Jun 23 2025 9:37 PM

Star Actress Shares Childhood Pics With Her Brother Birthday Occassion

ఎంత స్టార్ ‍హీరోయిన్లు అయినా ఏదో ఒక సందర్భంలో అదే రేంజ్‌ ఛాన్స్‌లు రావడం అంటే కాస్తా కష్టమే. అలాంటి వారి జాబితాలో ఈ హీరోయిన్ పేరు కచ్చితంగా ఉంటుంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ నుంచి ఐటమ్ సాంగ్స్ మాత్రమే చేసుకునే స్థాయికి వచ్చేసింది. అ‍ప్పుడప్పుడు ఒకటి, రెండు సినిమా ఛాన్సులు వచ్చిన అవీ కూడా పెద్దగా వర్కవుట్ కావడం లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన మెప్పించిన ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

మిల్కీ బ్యూటీగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తమన్నా.. తెలుగులో స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఆ తర్వాత అవకాశాల్లేక బాలీవుడ్‌కు మారిపోయింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడిపిన తమన్నా.. ప్రస్తుతం హీరోయిన్‌గా మాత్రం ఛాన్స్‌లు రావట్లేదు. గతేడాది రజినీకాంత్‌ జైలర్‌, స్త్రీ-2 చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో మెరిసింది మిల్కీ బ్యూటీ. ఇక ఈ ఏడాదిలో ఓదెల-2 మూవీతో ప్రేక్షకులను అలరించింది.

అయితే తాజాగా తన సోదరుడి బర్త్ డే సందర్భంగా చిన్నప్పటి ఫోటోలను షేర్ చేసింది. బాల్యంలో తన సోదరుడితో సంతోషంగా జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా సోదరుడు ఆనంద్ భాటియాకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది. అందులోనూ చాలా క్యూట్‌గా ఉన్న తమన్నాను చూసి ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ చిన్నప్పటి ఫోటో చూసిన వారు తమన్నా సో క్యూట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement