
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈనెల 22న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే రెడీ అయిపోయారు. దీంతో ఒక్కరోజు ముందుగానే అభిమానులకు విశ్వంభర బిగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ చిరు 70వ బర్త్డే మరింత గ్రాండ్గా జరుపుకోనున్నారు.
తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఎప్పటిలాగే బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో శ్రీజ కూతురు, తన మనవరాలితో మెగాస్టార్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. చిరువెంట ఆయన భార్య సురేఖతో పాటు చిన్నకూరుతు శ్రీజ సైతం విమానాశ్రయంలో కనిపించారు. ఈ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసనతో పాటు.. వీరి కుమార్తె క్లీంకారా కూడా పాల్గొననున్నారు.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రకటించారు.