నంద్యాల జిల్లా: పుట్టిన రోజంటూ కొత్త దుస్తులు కొనిచ్చుకుంటివి, వేసుకుందువు లెయ్యి రా అంటూ ఓ తండ్రి విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. తల్లి మృతిని జీరి్ణంచుకోలేక, ఆరోగ్యం కుదుట పడక జీవితంపై విరక్తితో పుట్టిన రోజు నాడే ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని అంకిరెడ్డి పల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రాస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు కుమారుడు కార్తీక్(23) పదో తరగతి తర్వాత అగ్రికల్చర్ చదువుతూ మధ్యలో మానేశాడు.
2016లో తల్లి అరుణకుమారి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో కార్తీక్ అప్పటి నుంచి ముభావంగా ఉండేవాడు. దీనికి తోడు ఇటీవల బ్రీతింగ్ సమస్యతో బాధ పడుతున్నాడు. మంగళవారం బర్త్‌డే ఉండటంతో సోమవారం కార్తీక్‌ను తండ్రి తాడిపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడంతోపాటు కొత్త దుస్తులు కొనిచ్చాడు. తనకు నంద్యాలలో పని ఉండటంతో వెళ్లిపోగా కార్తీక్ పట్టణంలోని పెద్దనాన్న కుమారుడి ఇంటికి వెళ్లాడు. రాత్రి వరకు అక్కడే సరదాగా గడిపాడు. మంగళవారం బర్త్‌డే కూడా ఇక్కడే చేద్దామని పెద్దనాన్న కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా నానమ్మ ఒక్కతే ఇందని గ్రామానికి చేరుకున్నాడు.
ఉదయం టిఫిన్ చేసి మేడ పైకి వెళ్లాడు. మధ్యాహ్నం అయినా భోజనానికి రాకపోవడంతో నానమ్మ నారాయణమ్మ వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సాయంతో ఉరి నుంచి తప్పించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తండ్రి గ్రామానికి చేరుకుని కొత్త దుస్తులు వేసుకుందువు లెయ్యి రా అంటూ విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాదీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


