ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం : వీడియో వైరల్‌

Video of Alleged Kanwariyas Drinking on the Bank of the Ganges in UP - Sakshi

లక్నో: గంగానది ఒడ్డున దేవాలయ పరిసరాల్లో కొందరు యాత్రికులు అర్థనగ్నంగా మద్యం సేవిస్తున్న వీడియో వైరలవుతోంది. వీరు కన్వర్‌ యాత్రికులుగా భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గంగా నది ప్రవహిస్తున్న ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో నదీముఖంగా ఉన్న శివాలయాలను దర్శించడానికి ఈ రోజుల్లో యాత్రికులు దేశం నలుమూలల నుంచి వస్తారు. దీనినే కన్వర్‌ యాత్ర అంటారు. ఈ నేపథ్యంలో కొందరు యాత్రికులు యూపీలోని హాపూర్‌లో గల ముక్తేశ్వర్‌ ఘాట్‌లో మద్యం సేవిస్తున్న వీడియో బయటపడింది. హిందువులు పవిత్రంగా భావించే ఇలాంటి ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషిద్ధం. అంతేకాక నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంపై హాపూర్‌ ఎసిపి సర్వేశ్‌ మిశ్రా ఎఎన్‌ఐతో మాట్లాడుతూ.. ప్రజలు పవిత్రంగా భావించే ప్రదేశాల్లో ఇలా చేయడం చట్టరీత్యా నేరం. వీడియోలో ఉన్న వ్యక్తులను ఇప్పటికే గుర్తించాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top