నడిచొచ్చే బంగారం ఈ బాబా | Golden Baba Who Wore 16 kg Gold For Kanwar Yatra | Sakshi
Sakshi News home page

కన్వార్‌ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తున్న ‘గోల్డెన్‌ బాబా’

Jul 30 2019 3:54 PM | Updated on Jul 30 2019 4:56 PM

Golden Baba Who Wore 16 kg Gold For Kanwar Yatra - Sakshi

ఈ సారి 4కిలోల బంగారం తక్కువ ధరించాను

లక్నో: సుధీర్‌ మక్కర్‌ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ‘గోల్డెన్‌ బాబా’  అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. గత కొన్నేళ్లుగా కన్వార్‌ యాత్రలో ఈ గోల్డెన్‌ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ గోల్డెన్‌ బాబాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ.. ‘ఇది నా 26వ కన్వార్‌ యాత్ర. గత ఏడాదితో 25 కన్వార్‌ యాత్రలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గత ఏడాది మేం సిల్వర్‌ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నాం. ఈ ఏడాది జూలై 21న కన్వార్‌ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభించాం. అయితే తొలుత ఈ ఏడాది కన్వార్‌ యాత్రకు దూరంగా ఉందామనుకున్నాను. కానీ నా అనుచరులు, అభిమానులు ఒత్తిడి చేయడంతో సరేనని ఒప్పుకున్నాను. పరమ శివుని అనుగ్రహంతో ఈ ఏడాది కూడా విజయవంతంగా కన్వార్‌ యాత్ర పూర్తి చేసుకున్నాను’ అని తెలిపారు.

‘ఇక నా ఒంటి మీద ఉన్న బంగారం నాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందనడంలో సందేహం లేదు. బంగారం ధరించడం అంటే నాకు చాలా ఇష్టం. తొలుత 2-3గ్రాముల బంగారం ధరించేవాడిని. రాను రాను దాని బరువు పెంచుతూ పోయాను. ఈ ఏడాది 16కిలోల బంగారం ధరించి వచ్చాను. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి 4కిలోల బంగారం తక్కువ ధరించాను. అయితే ఈ బంగారం అంతా నేను సొంతంగా సంపాదించుకున్నదే. ఎవరి దగ్గరి నుంచి విరాళాలు, డబ్బు స్వీకరించి కొన్న బంగారం కాదు’ అన్నారు. ఈ బాబా ధరించే ఆభరణాల్లో గొలుసులు, దేవతల లాకెట్లు, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు ఉంటాయి. ప్రతి ఏడాది 250-300మంది అనుచరులతో బాబా కన్వార్‌ యాత్రలో పాల్గొంటారు. వారందరికి అవసరమైన ఆహారం, నీరు, అత్యవసర మందులతో పాటు సొంత అంబులెన్స్‌ను కూడా ఆయనే సమకూర్చుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement