
సాక్షి,న్యూఢిల్లీ: కన్వర్ యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాల షాపులు, ఇతర దుకాణదారులు తమ పేర్లు బోర్డులపై ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాల్ని రద్దు చేయాలంటూ జారీ చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
కన్వార్ యాత్ర కొనసాగుతున్న రూట్లలో షాపులు,దుకాణాల వివరాల్ని వెల్లడిస్తూ ప్రదర్శించే క్యూఆర్ కోడ్ వివాదంపై పిటిషనర్లు (అపూర్వానంద్ జా, మహువా మోయిత్రా తదితరులు) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విధానం మతపరమైన వివక్ష, అసమానత్వానికి దారి తీస్తోందని పిటిషన్‌లలో పేర్కొన్నారు.
అయితే, ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్‌కే సింగ్‌లు క్యూఆర్‌కోడ్‌లను తొలగించాలనంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు తిరస్కరించారు. ఈ సందర్భంగా క్యూర్‌కోడ్ వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కన్జ్యూమర్ ఈజ్ కింగ్. వినియోగదారుడి ఏహోటల్‌లో ఏ వంటల్ని తయారు చేస్తున్నారు. గతంలో ఇదే హోటల్‌లో నాన్ వెజ్‌ను వడ్డించారా? అన్న విషయాలు తెలుసుకునే హక్కు ఉంది. అదే సమయంలో అయితే సదరు హోటల్ యజమానుల, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను బహిరంగంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. హోటల్ యాజమానులకు రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది