పెళ్లైన మహిళల్లో ఆ సమస్య ఎందుకు వస్తుంది? | Health Tips In Telugu, Why Does Vaginal Itching Keep Coming Back? Causes, Symptoms And Treatment | Sakshi
Sakshi News home page

పెళ్లైన మహిళల్లో ఆ సమస్య ఎందుకు వస్తుంది?

Aug 9 2026 10:56 AM | Updated on Aug 9 2026 2:01 PM

Helath Tips: Many women experience urinary infections after marriage

నా వయసు ఇరవై ఆరు సంవత్సరాలు. పెళ్లై మూడేళ్లు అయింది. నాకు ప్రతి నెలా యోనిలో దురద వస్తోంది. కొన్నిసార్లు ఆ భాగం ఎర్రగా కూడా మారుతోంది. మందులు వాడినా మళ్లీ మళ్లీ వస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది?
– రాజేశ్వరి, నంద్యాల

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, మీకు యోని ఈస్ట్‌ ఇన్ఫెక్షన్‌   ఉండే అవకాశం ఉంది. ఇది మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ముఖ్యంగా పెళ్లైన మహిళల్లో, ప్రసవ వయసులో ఉన్నవారిలో ఈ సమస్య అప్పుడప్పుడు లేదా తరచుగా మళ్లీ మళ్లీ రావచ్చు. సాధారణంగా యోనిలో కొన్ని మేలు చేసే సూక్ష్మజీవులు సహజంగానే ఉంటాయి. ఇవి ఆ ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

అయితే కొన్ని కారణాల వల్ల శిలీంద్రాల పెరుగుదల అధికమైతే ఈ సమతుల్యత దెబ్బతిని ఇన్ఫెక్షన్‌ వస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు యోని లోపల, బయట తీవ్రమైన దురద ఉంటుంది. ఆ భాగం ఎర్రగా మారుతుంది. మంటగా అనిపిస్తుంది. మూత్రం విసర్జించే సమయంలో మంట కలగవచ్చు. ఎక్కువగా గోకడం వల్ల గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాగే చిక్కగా, తెల్లగా ఉండే స్రావం కూడా రావచ్చు.

ఈ ఇన్ఫెక్షన్‌  రాకుండా ఉండాలంటే...

బిగుతుగా ఉండే దుస్తులు ధరించకండి.

గాలి సులభంగా ఆడే కాటన్‌ లోదుస్తులు వాడండి. ∙లోదుస్తులు ఉతికేటప్పుడు బలమైన సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.

యోని భాగంలో సువాసన క్రీములు, సుగంధ ద్రవ్యాలు, స్నాన ద్రావకాలు వాడకండి.

మృదువైన సబ్బులు మాత్రమే ఉపయోగించండి.

వైద్యుల సలహా లేకుండా యాంటీబయోటిక్‌ మందులు తీసుకోవద్దు.

ఆ భాగాన్ని ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.

కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్‌  దానంతట అదే తగ్గిపోవచ్చు. అయితే చాలామందికి మాత్రం సరైన చికిత్స అవసరమవుతుంది. తరచుగా మళ్లీ మళ్లీ వస్తుంటే దానిని నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి సందర్భాల్లో కారణాన్ని తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేయడం ద్వారా ఏ రకమైన ఇన్ఫెక్షన్‌  ఉందో, ఏ శిలీంద్రం కారణమైందో, దానికి ఏ మందు ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అలాగే మూత్ర పరీక్షలు, రక్తంలో చక్కెర స్థాయులు, శరీర రోగనిరోధక శక్తికి సంబంధించిన పరీక్షలు కూడా అవసరమవుతాయి. మధుమేహం ఉన్నవారిలో లేదా రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచు కనిపిస్తాయి.

కొన్నిసార్లు ఇతర వైరస్‌ ఇన్ఫెక్షన్లు లేదా రోగనిరోధక శక్తి తగ్గడం కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే, తరచుగా వచ్చే యోని ఈస్ట్‌ ఇన్ఫెక్షన్‌  చికిత్సను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా ఫ్లుకోనాజోల్‌ 150 మిల్లీగ్రాముల మాత్రను మూడు రోజులకోసారి చొప్పున మొత్తం మూడు మోతాదులు ఇవ్వవచ్చు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్‌  మళ్లీ రాకుండా ఉండేందుకు నిర్వహణ చికిత్సలో భాగంగా వారానికి ఒక మాత్ర చొప్పున ఆరు నెలల పాటు వాడాలని వైద్యులు సూచిస్తారు. 

లేదా క్లోట్రిమాజోల్‌ 500 మిల్లీగ్రాముల మాత్రలను రెండు వారాల పాటు వాడమని చెప్తారు. అనంతరం ఆరు నెలల పాటు వారానికి ఒకసారి చొప్పున వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే యోని నుంచి నమూనా సేకరించి పరీక్ష చేయించడం ద్వారా ఏ రకమైన శిలీంద్రం కారణమైందో గుర్తించి, దానికి తగిన చికిత్స అందిస్తారు. ఇలా పూర్తి చికిత్స తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్‌  పూర్తిగా తగ్గడమే కాకుండా, మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.

మేనిమాట! మెదడులో చెత్తబండి!
మనం దుప్పటి కప్పుకుని రాత్రిళ్లు ‘ఆఫ్‌’లో ఉంటే.. మెదడు మాత్రం ‘క్లీనింగ్‌ మోడ్‌ ఆన్‌ !’ చేసి, వ్యర్థాలను బయటకు పంపే పనిలో బిజీగా ఉంటుంది. అవును.. నిద్రలో ‘గ్లింపాటిక్‌ సిస్టమ్‌’ చురుగ్గా పనిచేసి, మెదడులో పేరుకునే కొన్ని వ్యర్థ పదార్థాలను ‘సెరెబ్రోస్పైనల్‌ ఫ్లూయిడ్‌ ’ ప్రవాహం ద్వారా తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్లో వేవ్‌ స్లీప్‌ సమయంలో ఈ ప్రక్రియ మరింత చురుగ్గా సాగుతుంది.

- డా, భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement