అనేక భాషలు నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..! | Speaking Multiple Languages May Help Keep The Brain Younger And Slow Down Brain Ageing, Study Finds | Sakshi
Sakshi News home page

అనేక భాషలు నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!

Aug 9 2026 9:38 AM | Updated on Aug 9 2026 11:42 AM

What are challenges of learning multiple languages

చిన్నప్పటి నుంచే పిల్లలకు ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్పించడం వల్ల... వారికి జీవితాంతం అనేక ప్రయోజనాలు ఉండవచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది. యూరోపియన్‌ న్యూరోసైన్స్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ ఫోరమ్‌లో సమర్పించిన ఈ అధ్యయనం... ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగే వారి మెదడు వయసు, వారి వాస్తవ వయసు కంటే తక్కువగా ఉంటుందని వెల్లడించింది. 

ఈ పరిశోధనలో మెదడు స్కాన్‌లను విశ్లేషించి, దాని కార్యకలాపాల నమూనాల ఆధారంగా మెదడు వయసును అంచనా వేయగల ‘బ్రెయిన్‌ ఏజింగ్‌ క్లాక్‌’ను రూపొందించారు. కృత్రిమ మేధ సాయంతో వివిధ వయసుల్లో మెదడులోని బ్రెయిన్‌కనెక్టివిటీస్‌లో చోటుచేసుకునే మార్పులను గుర్తించి, ఈ విధానంతో మెదడు వయసును అంచనా వేశారు. 

ఇలా చూసినప్పుడు... ఒక భాషే తెలిసిన వారి మెదడుతో పోలిస్తే... రెండు భాషలు మాట్లాడగలిగే వారి మెదడు సుమారు ఆరేళ్లు చిన్నదిగానూ, మూడు భాషలు మాట్లాడేవారి మెదడు ఏడేళ్లు చిన్నదిగానూ, నాలుగు భాషలు మాట్లాడేవారి మెదడు దాదాపు 13 ఏళ్లు చిన్నదిగా కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.

(చదవండి: సర్జికల్‌ మెనోపాజ్‌తో పెరిగే మూత్ర సంబంధ సమస్యలు!)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement