పాలివ్వడం అంత ఈజీ కాదు..!: బుల్లి తెర నటి దివ్యాంక త్రిపాఠి | Breastfeeding Struggles: Divyanka Tripathi Shares Personal Experience | Sakshi
Sakshi News home page

పాలివ్వడం అంత ఈజీ కాదు..!: బుల్లి తెర నటి దివ్యాంక త్రిపాఠి

Aug 6 2026 5:39 PM | Updated on Aug 6 2026 6:01 PM

Health Tips: Divyanka Tripathi Shares Breastfeeding Struggles

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూనిసెఫ్ సమన్వయంతో ఆగస్టు మొదటి వారాన్ని ప్రపంచ తల్లిపాల వారోత్సవంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్తతల్లులూ పాలివ్వడంలో తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు, పాలివ్వడంలో ఎదురయ్యే సవాళ్లు గురించి బుల్లి తెర నటి దివ్యాంక త్రిపాఠి చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.

దివ్యాంక త్రిపాఠి గత మే 26న ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చారు. ఇటీవలే రెండో నెల పుట్టినరోజుని తన భర్త నటుడు వివేక్‌ దహియాతో కలిసి జరుపుకుంటున్న ఫోటోలను పంచుకున్నారు కూడా. తల్లిపాల వారోత్సవంలో భాగంగా తల్లిగా తాను తన కుమారులకు పాలివ్వడంలో ఎదుర్కొన్న సవాళ్లకు గురించి మాట్లాడారు. నిజానికి శిశువుకి పాలు పట్టడం గురించి ఎవ్వరు బహిరంగంగా మాట్లాడరు. 

ఇలాంటి విషయాన్ని ఏదో నిషిద్ధ అంశంగా చూస్తుంటారని అన్నారామె. తల్లి పాలు బిడ్డకు చాలా మంచివని, అవి దాదాపు ఒక అమృతం లాంటివని అన్నారు. కనీసం ఆ విషయం గురించి తన అమ్మ, అక్క, స్నేహితులు సైతం పంచుకోలేదని అన్నారామె. నిజానికి బిడ్డకి పాలివ్వాల్సిన సమయం ఆసన్నమైనప్పుడూ లేదా బిడ్డ ఏడ్చినప్పుడూ..శరీరానికి దానంతట అదే తెలిసిపోతుంది. 

ఫలితంగా ఆటోమేటిగ్గా పాలు కారడం మొదలవతుంది..దీంతో ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే మహిళలు తమ బిడ్డకు ఒకటి రెండు సార్లు పాలు పట్టించడం మర్చిపోయినా లేదా మానేసినా అది కూడా చాలా బాధకరంగా ఉంటుందని అన్నారామె. తనకూడా ఎవరైన అతిథులు లేదా స్నేహితులు వచ్చినప్పుడూ బిడ్డకు పాలివ్వడం మానేస్తుంటానని, అది ఎంత పెయిన్‌గా ఉంటుందో చెప్పిందామె. అదొక అపరాధ భావనలా ఉంటుందని అన్నారు.

కొత్తతల్లులూ తెలుసుకోవాల్సింది...

తల్లిపాలు పట్టడం అనేది పరీక్ష కాదు. అలాగే బిడ్డకు పాలు సరిగ్గా పట్టించడం అనేది ఒక ప్రతిభ కాదు. అది కాలక్రమేణా తల్లీబిడ్డలు ఇద్దరూ నేర్చుకునే విషయం. ఇది అందరికీ ఒక నేర్చుకునే అనుభవం,"

పాలివ్వడం గురించి ఆందోళన చెందడం కంటే..వైద్యులను సంప్రదించండి..ఎలా పాలివ్వాలో నేర్చుకోండి.

అలాగే అపరాధ భావనతో బాధపడకూడదు. "పర్వాలేదు," అని ధీమాగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరి ముందు పాలివ్వలేం అలాంటప్పుడు బిడ్డకు పాలిస్తాను బయటకు వెళ్లమనో లేక మరో గదిలోకి వెళ్లి ఇవ్వడమో ధైర్యంగా చేయాలే తప్ప బిడ్డను నిరీక్షించేలా ఏడిపించకూడదు.

అందరికీ అన్ని విషయాలు తెలియవు..అనుభవ పూర్వకంగా తెలుసుకునేదే మాతృత్వ మధురిమ.

మదర్‌గా జర్నీ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అందువల్ల సహాయం తీసుకోవడంలో తప్పులేదని చెప్పారామె.

తల్లి అయ్యేంత వరకు ఎవ్వరికీ చనుబాల ఎలా పట్టించాలనేది తెలియదని తెలుసుకోండి. అందుకే నిస్సంకోచంగా పెద్దలు లేదా వైద్యులను సంప్రదించడం, సూచనలు, సలహాలు తప్పక తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు.

తాను కూడా తల్లి అయ్యాక పిల్లలకు పాలివ్వడం ఎలాగో తెలియక ఇబ్బంది పడ్డానని, ఒక్కోసారి రాత్రంతా మేల్కోని పిల్లలకు పాలు పట్టివ్వడం లేదా అలా ఇస్తూ నిద్రపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. దాంతో ఒక్కోసారి బిడ్డ జారిపోయిందేమో అని భయంతో ఉలిక్కిపడి మేల్కొనేదాన్ని అన్నారు. ఒక్కోసారి బిడ్డ సరిగా పాలు తాగుతోందా లేదా, సరిపడగా ఇవ్వగలుగుతున్నానా..అంటూ..భయపడుతుండేదాన్ని అని చెప్పుకొచ్చారు. వైద్యులను సంప్రదించిన తర్వాతే..క్రమక్రమంగా అది నాకు అలవాటైందని అన్నారామె.

(చదవండి: మాంసాన్ని తినే వ్యాధి'..! ఎందువల్ల వస్తుందంటే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement