అధికారుల ర్యాండమైజేషన్‌ పూర్తి | - | Sakshi
Sakshi News home page

అధికారుల ర్యాండమైజేషన్‌ పూర్తి

Feb 3 2026 7:43 AM | Updated on Feb 3 2026 7:43 AM

అధికారుల ర్యాండమైజేషన్‌ పూర్తి

అధికారుల ర్యాండమైజేషన్‌ పూర్తి

● కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌, సహాయ పోలింగ్‌ అధికారులు, ఇతర సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి చేశామని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫెరెన్స్‌ హాల్‌లో సోమవారం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ అధికారుల మొదటి విడత ర్యాండమైజేషన్‌ అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌ రావుతో కలిసి నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికల కోసం 20 శాతం అదనపు సిబ్బందితో కలిసి 153 మంది పోలింగ్‌ అధికారులు, 146 సహాయ పోలింగ్‌ అధి కారులు, 285 మంది ఇతర సిబ్బందిని ఎంపిక చేశామని తెలిపారు. అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని, ఇతర ఎన్నికల అధి కారులతో కలిసి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ హరిత హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషర్లు గజానంద్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

పొరపాట్లు లేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలి

పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం స్పష్టంగా చేపట్టాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి సోమవారం తహసీల్దార్లు, బూత్‌ స్థాయి అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్షించారు. బూత్‌స్థాయి అధికారులు పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించాలన్నారు. బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు, తహసీల్దా ర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. అనంతరం తహసీల్దార్లతో భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదాబైనామాలపై సమీక్షించారు. భూభారతిలో పట్టా మార్పిడి, విరాసత్‌ కోసం వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ధ్రువపత్రాల దరఖాస్తులను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులో పరిష్కరించి, జారీ చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement