అప్పుడు పంచాయతీ.. ఇప్పుడు మున్సిపల్
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ పట్టణం ఎన్నో ఒడిదొడుకుల మధ్య పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అవతరించింది. కొన్నేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. దశాబ్దాల చరిత్ర ఉన్న పట్టణంలో బుధవారం తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. గతంలో పలుమార్లు పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన ఓటర్లు ప్రస్తుతం బల్దియా ఎన్నికల్లోనూ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మేధావులు రాజకీయాల్లోకి రావాలి
ఆసిఫాబాద్ రాజకీయాలు చాలా మారాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి మేధావులు తప్పకుండా రావాలి. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో పోలింగ్ తక్కువగా నమోదవుతుంది. ప్రజలు ఓటు వేయడానికి ముందుకు రావడంలేదు. కనీసం 95శాతం పోలింగ్ జరిగేలా ఎన్నికల సంఘం చొరవ చూపించాలి. – శ్రీలేఖ, గృహిణి


